బిగ్ బాస్ బ్యూటీ సీక్రెట్ టాటూ చూపించి పిచ్చెక్కించింది!

Edari Rama Krishna
భారతీయ టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ కి మంచి ప్రాచుర్యం లభిస్తుంది.  బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ ఇప్పటికే పదకొండు సీజన్లు పూర్తి చేసుకుంది.  ఇక తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ప్రస్తుతం రెండో సీజన్ రన్ అవుతున్న నేపథ్యంలో తొలిసారిగా మాలీవుడ్ లో సూపర్ స్టార్ మోహన్ లాల్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

  తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 1 లో ఎన్టీఆర్ హోస్ట్ చేయగా ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.   ఇక బాలీవుడ్ బిగ్ బాస్ లో పదకొండు సీజన్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.  అక్కడి బిగ్ బాస్ లో ఎన్నో కాంట్రవర్సీలు నెలకొన్నాయి..ఇందులో పాల్గొన్న కంటెస్టంట్లు తర్వాత వెండితెరపై వెలిగిపోయారు. 

ఇక ఫ్యాషన్ ప్రపంచంలో తన గ్లామర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ అర్షి ఖాన్. కెరీర్ లో పెద్దగా సినిమాలు చేయలేదు గాని రియాలిటి షోల ద్వారా గుర్తింపు బాగానే అందుకుంది.  ఈ అమ్మడికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. తన సెక్సీ అందాలతో ఎప్పటికప్పుడు నెటిజన్స్ ను పలకరిస్తూనే ఉంటుంది. 

మోడలింగ్ లో అందాల ఆరబోతతో పలువురిని ఆకర్షంచిన అర్షి ఖాన్ ని గత ఏడాది బిగ్ బాస్ హౌస్ లోకి దింపారు. ఆ తరువాత అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చాలా మందిని తన సొగసులతో ఆకట్టుకుంది. ఇక రీసెంట్ గా ఈ బిగ్ బాస్ 11 బేబీ ఒక హాట్ ఫొటో షూట్ లో పాల్గొంది. తన సీక్రెట్ టాటూను ఘాటుగా ప్రజెంట్ చేసింది. హాలీవుడ్ ముద్దుగుమ్మల స్టైల్ లో టాటూ తో కనిపించి ఒకేసారి వైరల్ అయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: