ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో వరుసగా మల్టీస్టారర్ చిత్రాలు వస్తున్నాయి. ఇక మల్టీస్టారర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా విక్టరీ వెంకటేష్ ఉన్న విషయం తెలిసిందే. త్వరలో మెగా అబ్బాయి వరుణ్ తేజ్, వెంకటేష్ కాంబినేషన్ లో ఎఫ్ 2 రాబోతుంది. ఇక హీరో నాగార్జున, నేచురల్ స్టార్ నాని మల్టీస్టారర్ గా ఓ సినిమా రోబోతుందని వార్తలు వచ్చాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో దేవదాస్… ఈ పేరు ఎప్పటికీ మర్చిపోలేం. అందులో అక్కినేనినీ మర్చిపోలేం. ఏఎఎన్నార్ చేసిన క్లాసిక్స్ లలో ఎప్పటికీ మర్చిపోలేని చిత్రం.
తాజాగా ఇదే పేరును మరోసారి గుర్తుకు తెస్తుంది..వైజయంతీ మూవీస్. ఈ మద్య మహానటితో మంచి విజయాన్ని అందుకున్న వైజయంతీ మూవీస్..తాజాగా నాగార్జున, నాని నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రానికి ‘దేవదాస్’ అనే పేరు ఖరారు చేశారు. టైటిల్ లోగోని కొద్దిసేపటి క్రితమే.. విడుదల చేశారు. ఇందులో నాని డాక్టర్‌గా, నాగ్ ఓ మాఫియా డాన్‌గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే.
వాళ్లిద్దరి పాత్రలకు సింబాలిక్‌గా.. ‘శాంతాబాయ్ మెమొరియల్ ఛారిటీ హాస్పటల్’ అనే డాక్టర్ చిటీపై ఈ టైటిల్‌లోగోని ఉంచారు. లోగో కింద ఓ పిస్తల్ రెండు బుల్లెట్లు చూపించారు. మొత్తాని ఈ ఫస్ట్ లుక్ లో ఇద్దరు హీరోలకు మంచి న్యాయం చేసినట్లే కనిపిస్తుంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అశ్వనీదత్ నిర్మాత.