పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విషయం లో నోరు మెదపడేం..!

Prathap Kaluva

రేణు దేశాయ్ కి పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి వస్తున్న వేధింపుల గురించి రోజు రేణు వెల్లడిస్తున్న సంగతీ తెలిసిందే. అయితే ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ స్పదించక పోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక పక్క రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ అభిమానుల బెదిరింపులకు భయపడి ట్విట్టర్ అకౌంట్ నే క్లోజ్ చేసింది. పవన్ అభిమానులు రేణు దేశాయ్ ను చంపేస్తామనే దాకా వచ్చారు. 


పవన్‌కి వ్యతిరేకంగా రేణుదేశాయ్‌ గళం విప్పబోతోందంటూ జరుగుతున్న ప్రచారమే. 'పవన్‌కి వ్యతిరేకంగా మాట్లాడబోతున్నావట.. ఈ విషయమై స్పందించు..' అంటూ సోషల్‌ మీడియాలో వేధింపులు ఎక్కువైపోయాయి రేణుదేశాయ్‌కి. ఏం, పవన్‌కళ్యాణ్‌దే కష్టమా..? అయితే నేను ఇన్నాళ్ళూ పడినకష్టం మాటేమిటి.? ఎదుర్కొన్న అవమానాల సంగతేంటి.?' అని రేణుదేశాయ్‌ స్పందించింది. ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ ఏంటంటే, పవన్‌కళ్యాణ్‌కి వ్యతిరేకంగా తాను ఎప్పటికీ ఏమీ మాట్లాడబోనని హామీ ఇవ్వడం. 


పవన్‌కళ్యాణ్‌ సైతం, రేణుదేశాయ్‌ విషయంలో అభిమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి. మాజీ భార్యకి శుభాకాంక్షలు చెబితే సరిపోదు, అభిమానుల్నీ పవన్‌ కంట్రోల్‌లో పెట్టుకోవాల్సిందే. ఒక్క స్టేట్‌మెంట్‌.. ఒకేఒక్క స్టేట్‌మెంట్‌ ట్విట్టర్‌లో అయినా పడేస్తే.. రేణుదేశాయ్‌కి పవన్‌ అభిమానుల నుంచి 'థ్రెట్‌' తగ్గుతుందేమో. అది పవన్‌కీ మంచిదే. ఎందుకంటే, పవన్‌ పేరుతో ఇతరులైనా రేణుదేశాయ్‌ని దూషించేందుకు సాహసించరు.. దూషించినా ఆ ప్రభావం పవన్‌ మీద పడదు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: