చరణ్ నియంత్రణకు అసహనంలో బోయపాటి ?

Seetha Sailaja
ఫిలిం ఇండస్ట్రీలో మాస్ మసాల భారీ సినిమాలకు చిరునామాగా ఉండే బోయపాటి శ్రీనివాస్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రాబోతున్న మూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. తాను తీసే సినిమాల భారీతనం కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టవలసిన చోట 100 రూపాయలు ఖర్చు పెడతాడు అన్న పేరు బోయపాటికి ఉంది.

ఇప్పుడు ఈ విషయమై చరణ్ బోయపాటిల మధ్య గ్యాప్ ను పెంచుతోంది అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ‘రంగస్థలం’ ఘన విజయం తరువాత చరణ్ మార్కెట్ విపరీతంగా పెరిగిన నేపధ్యంలో ఆ మార్కెట్ కు తగ్గట్టుగా ఉండాలని బోయపాటి చరణ్ తో తాను తీస్తున్న విలన్ ఎంట్రీ సీన్ కోసమే కోట్లు ఖర్చు చేయించాడని టాక్. 

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి అనుకున్న బడ్జెట్ ఈ మూవీ మూడు వంతుల షూటింగ్ పూర్తి అయ్యేసరికే అయిపోవడంతో ఈ మూవీకి ఇంకా అదనంగా బడ్జెట్ కావాలని బోయపాటి నిర్మాత దానయ్యను అడిగినట్లు టాక్. జరుగుతున్న పరిణామాలను పరిగణలోకి తీసుకున్న చరణ్ ఈమూవీ బడ్జెట్ విషయమై బోయపాటికి క్లాస్ పీకి ఫుల్ కంట్రోల్ తీసుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఇలా బడ్జెట్ పెంచుకుంటూపోతే నిర్మాతకు లాభాలు ఎక్కడ వస్తాయి అని చరణ్ బోయపాటిని ప్రశ్నించడమే కాకుండా తనకు మార్కెట్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ఖర్చుపెట్టవద్దని చరణ్ బోయపాటిని కట్టడి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో జరుగుతున్న పరిణామాలకు బోయపాటి పైకి ఏమీ అనకపోయినా చరణ్ పై గుర్రుగా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హల్ చల్ చేస్తున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: