ఎన్టీఆర్ ముందు రామ్ తట్టుకోగలడా...!

Prathap Kaluva

ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత దసరా కి రిలీజ్ కానున్నదని ఇదివరకే నిర్మాతలు ప్రకటించారు. అయితే ఆ డేట్ కు ఇంకేమి పెద్ద సినిమా లు కూడా లేవు. అయితే ఒక్కసారిగా రామ్ నటిస్తున్న చిత్రం దసరాకు రిలీజ్ చేస్తున్నట్టు ఏకంగా డేట్ తో సహా పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా కు నిర్మాత దిల్ రాజు, మరీ ఇంత సాహసానికి దిల్ రాజు పూనుకోవడం ఆశ్చర్యం కలిగించే అంశమే..!


దసరా శుభాకాంక్షలతో అక్టోబర్ 18న వస్తున్నామంటూ ప్రకటించింది 'హలో గురు ప్రేమకోసమే' యూనిట్. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. నిజంగా అరవింద సమేత రేసులో ఉంటే దిల్ రాజు తన సినిమాను రిలీజ్ చేసేంత రిస్క్ చేయడు. సో.. ఎప్పట్నుంచో చెబుతున్నట్టు అరవింద సమేత దసరాకు వస్తుందా రాదా అనే డౌట్ ఇప్పుడు అందర్లో మొదలైంది. దసరాకు ఒకరోజు ముందు రామ్ సినిమా వస్తోంది.


కాబట్టి.. ఎన్టీఆర్ తన సినిమాను విడుదల చేయాలనుకుంటే సరిగ్గా దసరా రోజున (అక్టోబర్ 19) విడుదల చేయాలి. లేదంటే రామ్ సినిమా కంటే వారంరోజుల ముందు రిలీజ్ చేసుకోవాలి. దిల్ రాజు తన సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడంతో.. హారిక-హాసిని జనాలు ఏం చేస్తారో చూడాలి. షెడ్యూల్స్ పరంగా చూసుకుంటే అరవింద సమేత కంటే రామ్ సినిమానే తొందరగా షూటింగ్ పూర్తిచేసుకోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: