పవన్ కు సహాయపడుతున్న అరవింద సమేత వ్యూహాలు !

Seetha Sailaja
‘అజ్ఞాతవాసి’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో ఆసినిమాను కొని తీవ్రంగా నష్టపోయిన బయ్యర్లకు సుమారు 20 కోట్ల వరకు ఆసినిమాను నిర్మించిన రాథాక్రిష్ణ అదేవిధంగా పవన్ త్రివిక్రమ్ లు నష్టాలను సద్దుబాటు చేసుకోవడానికి డబ్బు తిరిగి ఇచ్చారు అన్న వార్తలు గతంలోనే వచ్చాయి. వీరంతా ఈ స్థాయిలో సహాయం చేసినా ఇంకా ‘అజ్ఞాతవాసి’ బయ్యర్ల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. 

ఈమూవీ వల్ల ఏర్పడ్డ చెడ్డ పేరును తొలిగించుకోవడానికి త్రివిక్రమ్ తన లేటెస్ట్ మూవీ ‘అరవింద సమేత’ ద్వారా ప్రయత్నాలు చేస్తున్న విషయం ఓపెన్ సీక్రెట్. ఈమధ్య కాలంలో జూనియర్ సినిమాలకు సక్సస్ రేట్ ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ‘అరవింద సమేత’ కు బయ్యర్ల నుండి భారీ ఆఫర్లు వస్తున్నాయి.

ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీని అత్యంత భారీ మొత్తానికి కొనుక్కోవడానికి బాలీవుడ్ మూవీ కార్పోరేట్ కంపెనీలు యుటివి రెలియన్స్ లు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారంమేరకు ఈ కార్పోరేట్ కంపెనీలు ఇస్తున్న ఆఫర్లను ఈసినిమా నిర్మాతలు అంగీకరిస్తే ఈమూవీ నిర్మాతలకు సుమారు 30 కోట్ల టేబుల్ ప్రొఫెట్స్ రావడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి. 

అయితే ఇలాంటి భారీ ఆఫర్స్ ను అంగీకరించకుండా ‘అజ్ఞాతవాసి’ వల్ల నష్టపోయిన బయ్యర్లకే ‘అరవింద సమేత’ ను కూడ ఇవ్వాలని త్రివిక్రమ్ ఆలోచన అని అంటున్నారు. ఇలా చేయడం వల్ల పవన్ వల్ల నష్టపోయాము అని అభిప్రాయపడుతున్న ‘అజ్ఞాతవాసి’ బయ్యర్లకు మేలు చేయడమే కాకుండా పరోక్షంగా పవన్ వల్ల నష్టపోయిన బయ్యర్లు ఉండకూడదు అన్న వ్యూహం కూడ త్రివిక్రమ్ మనసులో ఉన్నట్లు టాక్. ఇప్పటికే పవన్ త్రివిక్రమ్ ల మధ్య పెరిగిన దూరం బాగా తగ్గింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ‘అరవింద సమేత’ రైట్స్ ను ‘అజ్ఞాతవాసి’ బయ్యర్లకు కట్టపెడితే ప్రస్తుతం రాజకీయాలలో ఉన్న పవన్ వల్ల ఎవరు నష్టపోలేదు అన్న సంకేతాలు ఇవ్వడానికే ఈ వ్యూహాలు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: