సినీ రచయిత ఆత్మహత్య!

siri Madhukar
ఈ మద్య చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.   భవనంపై నుంచి దూకి సినీ యువ రచయిత ఆత్మహత్య బాలీవుడ్ యువ రచయిత బహుళ అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబైలో చోటుచేసుకుంది. నానా పటేకర్ నటించిన 'అబ్ తక్ చప్పన్' చిత్రానికి రచయితగా పనిచేసిన రవి‌శంకర్ అలోక్ (32) బుధవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున పెద్ద శబ్దం రావడంతో అటువైపు వెళ్లిచూసే సరికి అలోక్ రక్తపు మడుగులో పడి ఉన్నాడని వాచ్‌మెన్ వెల్లడించాడు.

అలోక్ వద్ద కానీ, ఆయన ఇంట్లో కానీ ఎలాంటి సూసైడ్ లెటర్ లభించలేదని పోలీసులు వెల్లడించారు.  రవిశంకర్ పశ్చిమ అంధేరీలోని సెవన్ బంగ్లాస్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. రవి శంకర్ అలోక్ తల్లిదండ్రులు కూడా కొద్ది రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారని, అయితే ఇటీవలే వారు తమ స్వస్థలం పట్నాకు వెళ్లినట్టు అక్కడ వాచ్‌మన్ తెలిపాడు.సాధారణంగా టెర్రస్ గేట్ లాక్ చేసి ఉంటుందని, దీన్ని అలోక్ ఎలా తెరిచాడో తెలియదని ఆయన పేర్కొన్నాడు. 

 కొంత కాలంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న అలోక్, సైక్రియాటిక్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. నానా పటేకర్ లీడ్ రోల్ పోషించిన ‘అబ్ తక్ చెప్పన్’ మూవీకి మాటల రచయితగా... అలాగే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా అలోక్ పనిచేశారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సుబ్రుబాన్ వెర్సోవా పోలీసులు విచారణ ప్రారంభించారు. ఏడాది కాలంగా అతనికి బాలీవుడ్‌లో అవకాశాలు రాకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. దీన్ని ప్రమాదవశాత్తు మరణంగానే కేసు నమోదుచేసినట్టు డీసీపీ పరంజిత్ సింగ్ దహియా తెలిపారు. 
Mumbai: 32-year-old man allegedly committed suicide by jumping off from the terrace of his apartment in Versova at around 2 pm yesterday. Police have registered an Accidental Death Report (ADR). Further investigation underway pic.twitter.com/8ebOsMsHx0

— ANI (@ANI) July 11, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: