ఆర్ ఎక్స్ 100 సూపర్ : వర్మ

Edari Rama Krishna

అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దగ్గర గతంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా అజయ్ భూపతి పని చేశారు. ఈ సందర్భంగా వర్మ స్పందిస్తూ, తన శిష్యుడిపై ప్రశంసలు కురిపిస్తూ ఓ ట్వీట్ చేశారు. భారీ హైప్, క్రేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన RX 100 చిత్రం మొదటిరోజున భారీ ఓపెనింగ్స్‌ను సాధిస్తున్నది.


తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ లభిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ జంట నగరాల్లోనూ, కృష్ణా, గుంటూరు, వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, అనంతపురం, అనకాపల్లి, గాజువాక సెంటర్లలో మంచి ఓపెనింగ్స్ వచ్చినట్టు తెలుస్తున్నది. RX 100 చిత్రం ఓపెనింగ్స్ సాధిస్తున్న నేపథ్యంలో రాంగోపాల్ వర్మ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.


RX 100 చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధిస్తున్నది. డైరెక్టర్ అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, హీరో కార్తికేయకు రోరింగ్ కంగ్రాట్స్. రిలీజ్‌కు ఏర్పడిన క్రేజ్‌తో ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెడుతున్నట్టు తెలిసింది. అంతేకాకుండా సినిమా ఓపెనింగ్స్, ప్రేక్షకుల స్పందన సూపర్‌గా ఉంది అని వర్మ ట్వీట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: