పవన్ ఎత్తుగడల వెనుక మహేష్ సలహాలు

Seetha Sailaja
రాజకీయాలకు దూరంగా ఉండే మహేష్ బాబు ప్రభావం పవన్ ఆలోచనలను ప్రభావితం చేస్తోందా అన్న ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. సమ్మర్ రేసుకు వచ్చిన ‘భరత్ అనే నేను’ మూవీలో ముఖ్యమంత్రి పాత్ర పోషించిన మహేష్ ద్వారా కొరటాల శివ ‘లోకల్ గవర్నెన్స్’ గురించి చెప్పించాడు.

ఏ ఊరికి ఆ ఊరు తమ సమస్యలు పరిష్కరించుకునే స్థితికి చేరుకుంటే ప్రజల సమస్యలు చాల సులువుగా తీరిపోతాయి అన్న సందేశాన్ని భరత్ పాత్ర ద్వారా కొరటాల తెలియచెప్పాడు. ఇప్పుడు ఇంచుమించు అదే భావాన్ని అనుసరిస్తూ పవన్ అడుగులు వేస్తూ ఉండటం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. 

రాబోతున్నది ఎన్నికల సీజన్ కాబట్టి రాజకీయ పార్టీలు అన్నీ ప్రజలను ఆకర్షించడానికి రకరకాల వాగ్దానాలు చేస్తూ ఆ వాగ్దానాలను తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టబోతున్నారు. పవన్ కూడ ఇదే బాట అనుసరిస్తూ ‘లోకల్ గవర్నెన్స్’ అన్న పదాన్ని మాత్రం పక్కకు పెట్టి ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజక వర్గాలకు ఒకేరకం సమస్యలు లేవు కాబట్టి 175 నియోజక వర్గాలకు 175 మేనిఫెస్టోలు ప్రకటిస్తాను అని అనడంతో పవన్ మహేష్ బాటలో నడుస్తున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

దీనినిబట్టి చూస్తుంటే రానున్న ఎన్నికలలో అనుకోకుండా ‘భరత్’ లోని మహేష్ మాటలు పవన్ ఆలోచనలుగా మారే ఆస్కారం కనిపిస్తోంది. ఇది ఇలా ఉండగా రేపు పార్లమెంట్ లో అవిశ్వాసం పై చర్చలు జరగబోతున్న నేపధ్యంలో తన సహజసిద్ధమైన మౌనాన్ని కొనసాగిస్తూ ఈ విషయమై ఇప్పటికీ పవన్ స్పందించకపోవడం మరో వ్యూహాత్మక తప్పిదం అవుతుంది అంటూ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా మహేష్ మాటలు పవన్ నోటివెంట రావడం మహేష్ అభిమానులకు జోష్ ను ఇచ్చే విషయం..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: