ఊహించని సమస్యలలో ప్రభాస్ సాహో !

Seetha Sailaja
అత్యంత భారీ బడ్జెట్ తో ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ తన దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఈమధ్యనే భాగ్యనగరానికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. దుబాయ్ లో ఈసినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరించిన తరువాత దర్శకుడు సుజిత్ తన తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో షూట్ చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. తెలుస్తున్న సమాచారంమేరకు ఈమూవీ సెకండ్ షెడ్యూల్ వచ్చే నెల నుంచి రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం కాబోతోంది. 

ఈసినిమాకు సంబంధించిన భారీ బడ్జెట్ తో పాటు చిత్రీకరణ కూడ ఎవరూ ఊహించని విధంగా ఉండాలి అన్న ఉద్దేశ్యంతో ఈమూవీ నిర్మాణం రకరకాల కారణాలతో ఇప్పటికే ఆలస్యం అవుతోంది. వచ్చే నెల ప్రారంభం కాబోతున్న ఈమూవీ సెకండ్ షెడ్యూల్ లో ఒక పాట చిత్రీకరణతోపాటు మెయిన్ విలన్ గా నటిస్తున్న నీల్ నితీష్ తో పాటు జాకీ ష్రాఫ్ చుంకీ పాండే మందిరా బేడీ తదితరులంతా ఈ షెడ్యూల్ లో పాల్గొంటారని తెలుస్తోంది. 

అయితే ఈసినిమా సీజే వర్క్ కోసం ఐదు నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. దీనితో ఈసినిమా సమ్మర్ లో ఏ నెలలో విడుదల అవుతుందో ప్రస్తుతం ప్రభాస్ కే తెలియని పరిస్థితి అని అంటున్నారు. ఈ పరిస్తుతులనేపధ్యంలో ఈసినిమా బాలీవుడ్ రైట్స్ ను 120 కోట్లకు కొనుక్కున్న టి.సిరీస్ సంస్థ యాజమాన్యం ‘సాహో’ నిర్మాతల పై తీవ్ర అసహనాన్ని వ్యక్త పరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో భారీ సినిమాల విడుదల తేదీలను 8 నెలల ముందు ప్రకటించి ఆమూవీ ప్రమోషన్ ను 6 నెలల ముందు నుంచి చేయడం బాలీవుడ్ ఇండస్ట్రీ సాంప్రదాయం. 

అయితే ఇప్పటికీ ‘సాహో’ నిర్మాతలు ఈసినిమా ఖచ్చితంగా సమ్మర్ రేస్ లో ఏ నెలకు విడుదలకు రెడీ అవుతుంది అన్న విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేకపోవడంతో ఇలా అయితే తాము ఈడీల్ ను క్యాన్సిల్ చేసుకుంటామని చెపుతున్నట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. దీనికితోడు ప్రభాస్ ఈమూవీ పూర్తి కాకుండానే  జిల్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో కృష్ణంరాజు నిర్మిస్తున్న సినిమాను వచ్చేనెల మొదలుపెడుతున్న నేపధ్యంలో అసలు ‘సాహో’ పరిస్థితి ఏమిటి అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: