ప్రముఖ నటి రేణూదేశాయ్ తన పిల్లలు అకీరా, ఆద్యతో కలిసి వెకేషన్స్ నిమిత్తం న్యూయార్క్ లో సరదాగా గడుపుతోంది. రెండు మూడేళ్ల కిందటి వరకు కూడా తల్లి చాటు తనయుడిగా... పాల బుగ్గల పసివాడిగా కనిపించాడు పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్. తల్లి రేణుదేశాయ్ దగ్గరే పెరిగిన అకీరా అప్పుడప్పుడు హైదరాబాద్ కి వచ్చిపోతూ మీడియా కంట పడుతుండేవాడు.
ఆ మద్య విజయవాడలో పవన్ కళ్యాన్ అద్దెభవనంలోకి అడుగు పెడుతున్న సమయంలో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉన్నాడు అఖిరానందన్. గతంలో ఎప్పుడూ ఎదిగే సగటు పిల్లాడిలాగే కనిపించేవాడు అకీరా. ఈ యేడాది ఆయన ఎదుగుదల అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తండ్రి పవన్ కళ్యాణ్ కంటే ఎత్తు పెరిగాడు. ప్రస్తుతం న్యూయార్క్ లో సరదాగా గడుపుతున్న అఖిరా గురించి రేణు దేశాయ్ కొన్ని సీక్రెట్లు బయట పెడతూ ఓ పోస్ట్ కూడా పెట్టింది.
‘నేను 5.8 అడుగులు. అకీరా నా కన్నా పొడుగు.. 14 ఏళ్ల వయసులోనే 6.3 అడుగులు ఉన్నాడు..’ అని ఆ పోస్ట్ లో చెప్పింది. ఆమె ఇటీవలే కొత్త బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పవన్ నుంచి విడిపోయిన ఆమె మరో వివాహం కోసం రెడీ అవుతోంది. ఇటీవలే రేణు నిశ్చితార్థ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఈ యేడాదిలోనే ఆమె వివాహం జరగనుందని తెలుస్తోంది. మరో ఫొటోలో ఆద్య తన కుక్క పిల్లతో ఆడుకుంటూ ఉంది. ‘ఆద్య, ఆమె న్యూయార్క్ ఫ్రెండ్ పాబ్లో’ అని పోస్ట్ చేసింది.