అమితాబ్ నాగార్జునల యాడ్ పై బ్యాంకుల తీవ్ర అసహనం !

Seetha Sailaja
ప్రముఖ జ్యూయలరీ షోరూం కల్యాణ్ జ్యూవెలర్స్ ను ప్రమోట్ చేస్తూ బాలీవుడ్ టాప్ స్టార్ అమితాబ్ అదేవిధంగా నాగార్జున లేటెస్ట్ గా నటించిన ఒక యాడ్ వివాదాలలో చిక్కుకుంది. కొద్ది రోజులక్రితం దుబాయ్ లోని కల్యాణ్ జ్యూవెలర్స్ స్టోర్ లో దొంగబంగారం అమ్ముతున్నారని వార్తలు రావడంతో ఆవార్తలను అప్పట్లో కళ్యాణ్ జ్యూవెలర్స్ ఖండించిన విషయం తెలిసిందే. 

ఈయాడ్ లో బ్యాంక్ కు వచ్చిన ఒక ముసలి వ్యక్తి పాత్రలో నటించిన అమితాబ్ నాగార్జునలు తమ పెన్షన్ లో తప్పులు పడ్డాయి అంటూ ఆ బ్యాంక్  అధికారులను ముసలాయన గెటప్ లో నాగార్జున అదేవిధంగా హిందీ యాడ్ లో అమితాబ్ ను నిలదీసి తప్పొప్పుల గురించి నిజాయితీ గురించి క్లాస్ పీకడం ఆవీడియోలో  కనిపిస్తుంది. అయితే కల్యాణ్ జ్యూవెలర్స్ ఎప్పటికీ నిజాయితీగా ఉంటుందని చెప్పే ఉద్దేశ్యంతో రూపొందింపబడ్డ ఈయాడ్ బ్యాంకింగ్ వర్గాలను మాత్రం తీవ్ర అసహనంలోకి తీసుకువెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఒక ముసలాయన తన మనవరాలిని వెంటబెట్టుకొని బ్యాంకుకు వెళతాడు. తన ఖాతాలో రెండు సార్లు పెన్షన్ జమ అయిందని మేనేజర్ కు చెబుతాడు. ఆ రెండో సారిపడిన డబ్బు వాపసు తీసుకోవాలని బ్యాంక్ అధికారిని కోరితే రెండుసార్లు డబ్బు జమ అయిన సంగతి ఎవరికీ తెలియదు కాబట్టి ఆడబ్బు ఉంచేసుకోవాల్సిందిగా మేనేజర్ ఉచిత సలహా ఇస్తాడు. ఎవరికైనా తెలిసినా తెలియకపోయినా తప్పు తప్పేనని తానెపుడూ తప్పుచేయనని మేనేజర్ కు నాగ్ మరియు అమితాబ్ తమతమ యాడ్స్ లో క్లాస్ పీకుతారు. 

అయితే ఈయాడ్ ప్రస్తుతం అటు హిందీలో ఇటు దక్షిణాది భాషలలో బుల్లితెర పై విపరీతంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈయాడ్ లో తప్పుచేయమని ఒక బ్యాంకింగ్ అధికారి సూచించినట్లుగా కథనం నడవడంతో తమ దగ్గరకు వచ్చే కష్టమర్లు నిజయితీగా ఉంటాము అంటే ఆవిషయాలను పట్టించుకోకుండా తాము తమ కష్టమర్లను అవినీతి పరులుగా మారుస్తున్నామా అంటూ ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఈయాడ్ ను ప్రసారం నిలుపుదల చేయకపోతే కోర్టుకు వెళతాము అంటూ కల్యాణ్ జ్యూవెలర్స్ సంస్థను హెచ్చరించింది. ఏమైనా నిజాయితీ గురించి నాగార్జున అమితాబ్ లు క్లాసు పీకుతూ చేసిన యాడ్ కు ఆదిలోనే అడ్డంకులు ఏర్పడ్డాయి అనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: