బాబు గోగినేని పై వ్యూహాలు మార్చుకుంటున్న బిగ్ బాస్ !

Seetha Sailaja
‘బిగ్ బాస్ 2’ హౌస్ మేట్స్ లో ప్రస్తుతం మంచి ఓటింగ్ స్థాయిలో కొనసాగుతున్న బాబు గోగినేనికి ఊహించని షాక్ బిగ్ బాస్ ఇవ్వబోతున్నాడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు బాబు గోగినేని పై ఇప్పటికే రిజస్టర్ చేయబడ్డ రకరకాల కేసులకు సంబంధించి ‘బిగ్ బాస్’ హౌస్ నుండి బయటకు వచ్చి పోలీసు విచారణకు హాజరు అవ్వవలసిన పరిస్థుతులు బాబు గోగినేనికి తప్పడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం బాబు గోగినేని వ్యవహారం ఇప్పుడు వేగం అందుకుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన నోటీసులు బిగ్ బాస్ కార్యక్రమ నిర్వాహకులకు మరో రెండు మూడు రోజులలో ఇచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు. 

దీనితో బాబు గోగినేనిని గతంలో ముమైత్ ఖాన్ విషయంలో జరిగినట్లుగా ఒకరోజు విచారణకు వెసులుబాటు ఇచ్చి తిరిగి ‘బిగ్ బాస్’ షోలోకి ఎంటర్ చేయాలా లేదంటే ఎలిమినేషన్ రౌండ్ లో బాబు గోగినేనిని పూర్తిగా తప్పించేయాలా అన్న ఆలోచనలు స్టార్ మా యాజమాన్యం చేస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ నోటీసులు డైరెక్ట్‌గా బాబు గోగినేనికి ఇస్తారా ? లేదంటే ‘బిగ్ బాస్’ షో నిర్వాహకులకు అందజేస్తారా అన్న విషయం పై క్లారిటీ లేదు అని అంటున్నారు. 

ఒకవేళ బాబు గోగినేనిని బయటకు రప్పిస్తే మళ్లీ బిగ్‌బాస్‌ షోకు పంపించడం అసాధ్యం అన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన పై రిజిష్టర్ అయిన కేసుల తీవ్రతను బట్టి బెయిల్ దొరకడం కూడ కష్టం అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ‘బిగ్ బాస్ 2’ షోలో ఒక పెద్దరికాన్ని కొనసాగిస్తున్న బాబు గోగినేని ఎలిమినేట్ అయితే ఆ స్థాయికి తగ్గ వ్యక్తి కోసం మళ్ళీ స్టార్ మా తన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రయత్నించాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: