ముద్దుల కూతురు సితార పుట్టిన రోజుకు మహేష్ స్పెషల్ కేక్..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో ప్రిన్స్ మహేష్ బాబు తన కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే.   ముఖ్యంగా తన పిల్లల విషయంలో ఎంతో శ్రద్ద తీసుకుంటారు.  తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. సితార ఆరేళ్ళు పూర్తి చేసుకుని ఏడవ ఏటలోకి అడుగుపెట్టింది. మహేష్ బాబు, నమ్రతల లైఫ్ లోకి సితార వచ్చి అప్పుడే ఆరేళ్లు అయిపోయాయి.

ఆరేళ్లు నిండి ఏడో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ, సితార పుట్టిన రోజు వేడుకలను ఓ స్టార్ హోటల్ లో సెలబ్రేట్ చేసుకున్నాడు. సితార బర్త్ డే కోసం ప్రత్యేకంగా కేక్ తయారు చేయించినట్లు తెలుస్తోంది.కేక్ పై మహేష్ బాబు ఫ్యామిలీ ఫోటో ఉండేలా డిజైన్ చేశారు. సితార బర్త్ డేకి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   మహేష్ తన ముద్దుల కూతురు తో ఎప్పుడూ సరదాగా ఉంటారు.. అంతే కాదు అచ్చం తన కూతురు మహేష్ తల్లిగారిలా ఉంటుందని స్టేట్ మెంట్ ఇచ్చిన విషయం తెసిందే.   

కాబోయే సూపర్ స్టార్ గా ప్రిన్స్ అభిమానులు భావించే గౌతమ్ కూడా ఈ చిత్రాల్లో ఉన్నాడు.సినిమాల విషయాన్ని వస్తే మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు గడ్డం, మీసాలతో సరికొత్త గెటప్ లో కనిపిస్తున్నారు. ఇప్పటి నుంచే ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెరుగుతున్నాయి.
Wishing my everything a very happy 6th ♥♥♥ May you have all that you wish for and more 🤗🤗🤗 I love you Sita papa😘😘😘 pic.twitter.com/VHDpNQSQ7Z

— Mahesh Babu (@urstrulyMahesh) July 19, 2018 Birthday Celebrations of Little Princess Sitara's 6th Birthday #HBDAdorableSITARA pic.twitter.com/4vqJ6rg53U

— BARaju (@baraju_SuperHit) July 20, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: