అజ్ఞాతవాసిని మోస్తున్న నాని నిర్ణయం !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ అభిమానలులకు పీడ కలలా మారిన ‘అజ్ఞాతవాసి’ షాక్ నుండి కోలుకోవడానికి త్రివిక్రమ్ పడ్డ కష్టాలు తెలిసినవే. ఒక్క ఫ్లాప్ సినిమా ఇండస్ట్రీలో పరిస్థితిని తలకిందులు చేస్తుంది. హిట్ లేకపోతే  ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు ఎవరినీ పట్టించుకోరు. ఈ లాజిక్ టాప్ హీరోలకు దర్శకులకు కూడ వర్తిస్తుంది 

‘అజ్ఞాతవాసి’ పవన్ త్రివిక్రమ్ లకే కాదు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్  కు కూడ ఘోర అవమానాన్ని ఇచ్చింది. ఈమూవీతో తెలుగులో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నించినా ఇతడి కలలు నీటి బుడగలుగా మారి పోయాయి. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో అనిరుద్ పేరు చెపితే అందరు భయపడిపోయారు.  

వాస్తవానికి  అనిరుధ్ కు అవకాశాలు లేకుండా ఖాళీగా లేడు. తమిళనాట అగ్ర హీరోల సినిమాలకు చేస్తూ క్రేజీ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నాడు. పెద్దపెద్ద ఆఫర్లు వస్తున్నాయి. అయితే భారీ పారితోషికాలు ఇచ్చే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలగాలని ప్రయత్నించిన ఇతడి కలలు ఇప్పటికీ తీరకపోవడం ఇతడికి ఒక లోటుగా మారింది.  ఇలాంటి పరిస్థుతులలో హీరో నాని. తన నెక్ట్స్ ప్రాజెక్టు కు అనిరుధ్ ను సంగీత దర్శకుడిగా అవకాశం ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న జెర్సీ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. గతంలో చేతివరకు వచ్చిన త్రివిక్రమ్ ఎన్టీఆర్ మూవీ ఆఫర్ కూడా చేజారిపోయి ఆతరువాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన అనిరుధ్ కు నాని పిలిచి అవకాసం ఇవ్వడం ఒక సాహసం అని అంటున్నారు. మరి నానీ నమ్మకాన్ని అనిరుధ్ ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూడాలి..    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: