మామయ్య ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అదే : సమంత

siri Madhukar
సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ పరంగా యూత్ హృదయాలను దోచేసిన సమంత .. ఇటీవల నటనకి ఎక్కువ అవకాశం వుండే పాత్రలనే చేస్తూ వెళుతున్నారు. ప్రస్తుతం గ్లామర్ తో పాటు నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటోన్న టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత....వరుస హిట్ లతో దూసుకుపోతోంది. రాజుగారి గది-2లో కీలకమైన పాత్ర పోషించిన సమంత.....రంగస్థలం - మహానటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలను పోషించి ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలనూ దక్కించుకుంది. యూటర్న్ తో సెప్టెంబర్ 13న సమంత మరోసారి ప్రేక్షకుల మందుకు రాబోతోంది.   

తాజాగా విడుదలైన యూటర్న్ `ఫస్ట్ లుక్` పోస్టర్ ను తన ట్విట్టర్ ఖాతాలో సమంత  షేర్ చేసింది. ఈ సందర్భంగా అభిమానులతో సమంత చాట్ ఆసక్తికరంగా సాగింది.ఇప్పటివరకు నాగార్జున తనకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏమిటని అభిమాని అడిగిన ప్రశ్నకు...సామ్ ఆసక్తికర సమాధానమిచ్చింది. నాగ చైతన్యకి భార్యగా తనని అంగీకరించడమే తనకి మామ ఇచ్చిన పెద్ద గిఫ్ట్' అని ఆమె సమాధానమిచ్చారు. ఇక మిగతా అభిమానులు అడిగిన ప్రశ్నలకి స్పందిస్తూ .. 'యూ టర్న్' సినిమాలో జర్నలిస్ట్ 'రచన' పాత్రలో నేను కనిపిస్తాను.

ఈ సినిమాలో నాకు ముక్కుపుడక ఉంటుంది .. అయితే అది మీరనుకున్నట్టుగా నిజంగా కుట్టించుకోలేదు. ఇక దర్శకుడు పవన్ కుమార్ కి గల ప్రతిభ కారణంగానే ఈ సినిమాను ఒప్పుకున్నాను.   తెలుగు - తమిళ భాషల్లో కూడా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పానని తెలిపింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా ఆది పినిశెట్టి - రిపోర్టర్ గా రాహుల్ రవీంద్రన్ కీలకమైన పాత్రల్లో కనిపిస్తారని చెప్పింది. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని - సెప్టెంబర్ 13న విడుదల చేస్తున్నామని చెప్పింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: