బిగ్ బాస్-2 కోసం మొదటి సీజన్ విన్నర్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ..!

shami
నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ ఇప్పుడే ట్రాక్ లోకి వచ్చింది. షో మొదలై నెల గడుస్తున్నా నాని వచ్చే శని ఆదివారాలు తప్ప మిగతా రోజుల్లో నీరసంగా ఉండేది. అయితే లాస్ట్ వీక్ యాంకర్ ప్రదీప్ ఎంట్రీ వల్ల షో మీద ఆసక్తి పెరిగింది. ఇక ఇప్పుడు దాన్ని మరింత పెంచేలా బిగ్ బాస్ టాస్కులు ఉన్నాయి.


లేటెస్ట్ టాక్ ప్రకారం బిగ్ బాస్-2 హౌజ్ లోకి బిగ్ బాస్ 1 విన్నర్ శివ బాలాజి ఎంట్రీ ఇస్తున్నాడని టాక్. మొదటి సీజన్ లో టఫ్ కంటెస్టంట్స్ అందరిని వెనక్కి నెట్టేసి ఫైనల్ విన్నర్ గా నిలిచాడు శివ బాలాజి. ఎన్.టి.ఆర్ చేతుల మీదుగా ప్రైజ్ మనీ కూడా అందుకున్నాడు. 


బిగ్ బాస్ తర్వాత ఏదో ఒక సినిమాలో కనిపించిన శివ బాలాజి పెద్దగా బయట కనిపించలేదు. అయితే మరోసారి బిగ్ బాస్ ద్వారానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట. ఒకవేళ నిజంగానే బిగ్ బాస్-2లో శివ బాలాజి వస్తే మరింత క్రేజ్ వచ్చేస్తుంది. తప్పకుండా మళ్లీ ఆడియెన్స్ ఈ షో మీద ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది.


తమిళంలో మొదటి సీజన్ లో టాప్ కంటెస్టంట్ గా నిలిచిన ఓవియా టైటిల్ గెలవకపోయినా మొదటి సీజన్ లో అందరి మనసులను గెలిచింది. అందుకే ఈ సీజన్ లో ఆమెను గెస్ట్ గా పిలిచారు. ఆ ఫార్ములాతోనే మళ్లీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో శివ బాలాజి వచ్చి ఈ షోని నిలబెడతాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందన్నది తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: