సుశాంత్ కు అదృష్టంగామారిన చైతు సమంతల పెళ్లి !

Seetha Sailaja
నాగార్జున మేనల్లుడుగా టాలీవుడ్ హీరో ఎంట్రీ ఇచ్చి 10 సంవత్సరాలు గడిచిపోతున్నా సుశాంత్ కు ఇప్పటి వరకు చెప్పుకోతగ్గ ఒక్క హిట్ కూడ తగలలేదు. దీనితో చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్న సుశాంత్ తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈవారం ‘చి.ల.సౌ’ మూవీ ద్వారా వస్తు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. 

ఈమూవీని ఎలాగైనా హిట్ చేయాలి అన్న ఉద్దేశ్యంతో విపరీతంగా ప్రమోట్ చేస్తూ అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.ఈమూవీకి సంబంధించిన ఆలోచనలు తనకు సమంత నాగచైతన్యల  నిశ్చితార్థ ఫంక్షన్ లో వచ్చాయని అంటూ ఒక ఆసక్తికర విషయాన్ని లీక్ చేసాడు. ఆ ఫంక్షన్ లో నటుడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తాను ఒకే టేబుల్  దగ్గర కూర్చుని ఉన్నప్పుడు తాను ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నానో తన అభిరుచులు ఏమిటో రాహుల్ రవీంద్రన్ కు చెప్పానని ఆ ఆలోచనల నుంచి వచ్చిన కథ ‘చి.ల.సౌ’ అని అంటున్నాడు.

వరస పరాజయాలతో తనకు ఏర్పడ్డ నిరాశతో ఈమూవీని పూర్తి అయ్యేవరకు తన సన్నిహితులకు కూడ చూపెట్టలేదు అని చెపుతూ చివరకు ఈమూవీని సమంత చూసి బాగా మెచ్చుకుని నాగచైతన్యకు చెప్పి అన్నపూర్ణ స్టూడియోస్ పతాకం పై విడుదల చేస్తున్నారు అంటూ ఈసినిమా వెనుక జరిగిన అసలు కథను వివరించాడు.వాస్తవానికి ఈసినిమాకు ‘చిరంజీవి అర్జున్’ అన్న టైటిల్ ను అనుకున్న విషయాన్ని వివరిస్తూ అయితే ‘అర్జున్ రెడ్డి’ మూవీ సంచలన విజయం సాధించడంతో తన మూవీ ‘అర్జున్ రెడ్డి’ కి సీక్వెల్ అనుకుంటారని తమకు వేరే మార్గం లేక ఈమూవీకి వెన్నెల కిషోర్ సలహాతో ‘చి.ల.సౌ’ అన్న టైటిల్ ను ఫిక్స్ చేసాము అని అంటున్నాడు ఈ అక్కినేని మనవడు.

22సంవత్సరాలకే 40సంవత్సరాల వయస్సు ఉన్న అమ్మాయిలా ఆలోచించే ఒక విచిత్రమైన మనస్థత్వం ఉన్న అమ్మాయి చుట్టూ తిరగే ఈమూవీ విజయం పై అక్కినేని కాంపౌండ్ కు కూడ చాల భారీ అంచనాలు ఉన్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: