అల్లు అర్జున్ ఓవర్ యాక్షన్ కామెంట్స్ మీద సెటైర్స్...!

Prathap Kaluva

అల్లు అర్జున్ గీత గోవిందం ఆడియో ఫంక్షన్ లో చేసిన కొన్ని కామెంట్స్ మరీ అతిగా ఉన్నాయని చాలా మంది ఫీల్ అవుతున్నారు. విజయా దేవరకొండ ను పొగిడే క్రమంలో ఆ పొగడ్తలు కొంచెం శృతి మించాయని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మనకు ఎంతో మంది నటులు ఉన్న అతను గొప్ప నటుడు అని కితాబు ఇచ్చాడు అయినా విజయ దేవరకొండ అర్జున్ రెడ్డి లో బాగానే యాక్ట్ చేశాడు. కానీ దానిని గొప్ప నటులతో పోల్చే అంతగా ఉన్నదా ... అనేది పాయింట్. అర్జున్ రెడ్డి క్యారెక్టర్ లోని నిజాయతీ ని దర్శకుడు బాగా చూపించాడు. 


ఇంకా ఏమన్నాడంటే, ‘‘అర్జున్‌రెడ్డి’ చూసిన తర్వాత వారం రోజులు నేనెవరితోనూ మాట్లాడలేదు. కావాలంటే వాసుని అడగండి..  వారం రోజులు ఎవరినీ కలవలేదు. ఎహె… మనం ఏ సినిమాలు చేస్తున్నాం’ అనుకున్నా. వన్‌ వీక్‌ టు టెన్‌ డేస్‌… బాగా డిస్ట్రబ్‌ అయిపోయా. ఆ సినిమాలో తను చేసిన పర్ఫార్మెన్స్‌ నచ్చింది. మనకున్న అవార్డ్స్‌లో బెటర్‌ అవార్డ్స్‌ ఫిల్మ్‌ఫేర్‌. ఆ ఇయర్‌ ఇద్దరు ముగ్గురు బాగా చేసినా… తనకి రావాలని అనుకున్నా.


హీరోల్లో ది బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు. మనస్ఫూర్తిగా తనకి ఫిల్మ్‌ఫేర్‌ రావాలనుకున్నా. తనకి బెస్ట్‌ డెబ్యూ, అలా సర్దే అవార్డ్స్‌ ఇవ్వకూడదని అనుకున్నా’’ అన్నాడు. చివర్లో విజయ్‌ దేవరకొండని ఆకాశానికి ఎత్తేశాడు. ‘‘తెలుగులో మంచి మంచి నటులున్నారు. అతికొద్ది మంది గొప్ప నటులున్నారు. విజయ్‌ దేవరకొండ గొప్ప నటుడు’’ అని అల్లు అర్జున్‌ చెప్పాడు. తర్వాత అతణ్ణి గారు అని సంబోధించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: