త్రివిక్రమ్ ఎక్కడా తగ్గడం లేదు..!

Edari Rama Krishna
అవును ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ జోరు పెంచారు..ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీస్తున్న ‘అరవింద సమేత’ చిత్రం షూటింగ్ చక చకా పూర్తి చేస్తున్నాడు.  ఇక  ‘అత్తారింటికి దారేది’ లాంటి ఒకట్రెండు సినిమాల్ని మినహాయిస్తే త్రివిక్రమ్ చిత్రాల్లో చాలా వరకు నెమ్మదిగా చిత్రీకరణ జరుపుకున్నవే.  అంతే కాదు ఈ ఏడాది వచ్చిన ‘అజ్ఞాతవాసి’కూడా ఎన్నో బాలారిష్టాలు దాటి రిలీజ్ అయ్యింది.  కానీ అనుకున్న స్థాయిలో మెప్పించకపోగా డైరెక్టర్ గా రిమార్కులు తెచ్చుకున్నాడు త్రివిక్రమ్. 

జూనియర్ ఎన్టీఆర్‌తో ఆయన ప్రస్తుతం చేస్తున్న ‘అరవింద సమేత’ విషయంలోనూ ఇలాగే జరుగుతుందేమో అనుకున్నారు చాలామంది.  వాస్తవానికి ఈ చిత్రం షూటింగ్ కూడా కొంత ఆలస్యంగానే మొదలైంది. దాంతో ఇక ‘అరవింద సమేత’ షూటింగ్ పూర్తి చేసుకునే సరికి చాలా టైమ్ పడుతుందని..అది వచ్చే ఏడాదికే రిలీజ్ అవుతుందని ఫిక్స్ అయ్యారు అభిమానులు.   కానీ ఒక్కసారి షూటింగ్ మొదలయ్యాక మాత్రం త్రివిక్రమ్-ఎన్టీఆర్ సూపర్ స్పీడు చూపిస్తున్నారు. చకచకా చిత్రీకరణ అయిపోతోంది.

ఇప్పటికే నాలుగింట మూడొంతుల షూటింగ్ ముగిసినట్లు సమాచారం. మిగతా షూటింగ్ పూర్తి చేయడానికి త్రివిక్రమ్ అండ్ కో  ఒక డెడ్ లైన్ కూడా పెట్టుకుందట. సెప్టెంబరు 15కు సినిమాను పూర్తి చేయనున్నారట. చిత్రంలోని ప్రధాన నటీనటుల డేట్లు కూడా అప్పటి వరకే తీసుకున్నారట. షూటింగ్ అయ్యాక మిగతా నాలుగు వారాల్లో పోస్ట్ ప్రొడక్షన్.. ప్రమోషన్ కానిచ్చి సినిమాను అనుకున్నట్లుగా దసరాకు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ కావడంపై కూడా త్రివిక్రమ్ సీరియస్ అయిన విషయం తెలిసిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: