దిల్ రాజ్ సెంటిమెంట్ లో వీక్నెస్ !

Seetha Sailaja
టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ సక్సస్ ఫుల్ నిర్మాతగా వరసపెట్టి సినిమాలు తీస్తున్న దిల్ రాజ్ స్పీడ్ చూసి ఇండస్ట్రీలోని ప్రముఖులు అంతా ఆశ్చర్యపోతున్నారు. సంవత్సరానికి కనీసం మూడు నాలుగు సినిమాలు తన నిర్మాణ సంస్థ నుండి వచ్చేవిధంగా ప్లాన్ చేసుకుంటున్న దిల్ రాజ్ వ్యవహార శైలి చాల మందికి అర్ధంకాని విషయంగా మారింది. 

సినిమారంగంలో సెంటిమెంట్లు లేనివారు ఉండరు. ముఖ్యంగా  చాలామంది హీరోలు నిర్మాతలు తమ సినిమాల విడుదలకు ముందు తమ ఇష్టదైవాల ఆలయాలకు వెళ్లడం లక్కీ హ్యాండ్ అన్నవారిచేత ఫస్ట్ టికెట్ కొనిపించడం ఇలా చాలారకాల పద్ధతులు అనుసరిస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో నిర్మాత దిల్ రాజుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా చాలా సెంటిమెంట్లు వున్నాయని తెలుస్తోంది.

దిల్ రాజ్ తన ప్రతి సినిమా విడుదలకు ముందు తిరుపతికి వెళ్ళడం ఒక ఓపెన్ సీక్రెట్ అయినా చాల మందికి తెలియని మరొక సీక్రెట్ దిల్ రాజ్ కు ఉందని తెలుస్తోంది. తన సినిమా విడుదలకు ముందు అన్ని పనులు పూర్తి చేసుకుని దిల్ రాజ్ ఎవరికీ చెప్పకుండా ఒక రహస్య ప్రదేశానికి వెళ్ళిపోతాడట. 

ఆఖరికి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికీ అందుబాటులో లేకుండా సింగపూర్ లోని కేసినోలలో చిన్నచిన్న పందాలు కాసుకుంటూ కాలం గడపడం అతడి అలవాటు అట. ఇప్పుడు ఈవారం విడుదల కాబోతున్న ‘శ్రీనివాస కళ్యాణం’ పనులు పూర్తి కావడంతో ఇప్పుడు దిల్ రాజ్ మళ్ళీ సింగపూర్ వెళ్ళి తనకు ఇష్టమైన కేసినో లో కాలం గడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏమైనా అదృష్టం ప్రస్తుతం దిల్ రాజ్ వెంట పరుగులుతీస్తోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: