‘విశ్వరూపం2’వాయిదా పడుతుందా?

siri Madhukar
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం-2’ఇప్పుడు మరో చిక్కుల్లో పడిందా అంటే అవుననే అంటున్నారు. ఒక సినిమా పూర్తయ్యాక విడుదల విషయంలో జాప్యం జరిగిందంటే దాని మీద ఆసక్తి తగ్గిపోతుంది. అది కూడా కొన్ని నెలలైతే పర్వాలేదు కానీ.. ఏళ్లకు ఏళ్లు సినిమా వాయిదా పడిందంటే ఇక అంతే సంగతులు.  ఇప్పటి వరకు ఎన్నో అవరోధాలు దాటుకొని కమల్ నటించిన ‘విశ్వరూపం 2’ మొత్తానికి అన్ని పనులు పూర్తి చేసుకొని ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సిద్దంగా ఉన్నారు.  


 ‘విశ్వరూపం’ స్టయిల్లోనే కనిపిస్తున్న ఈ సినిమాపై కమల్ ధీమాగా ఉన్నప్పటికీ.. ఐదేళ్ల నిరీక్షణ తర్వాత ప్రేక్షకుల్లో దీనిపై ఏమాత్రం ఆసక్తి నిలిచి ఉంటుందా అన్న సందేహాలు మాత్రం కొనసాగుతున్నాయి.  ఇదిలా ఉంటే..ఇప్పుడు ‘విశ్వరూపం 2’ సినిమాకు కొత్త చిక్కులు వచ్చాయని అంటున్నారు.  డీఎంకే అధినేత కరుణానిధి మరణంతో తమిళ సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. సాయంత్రం చైన్నైలోని కావేరీ హాస్పిటల్‌లో ద్రవీడ సూరీడు కన్నుమూసాడన్న వార్త తెలియడంతో ఆయనకు నివాళిగా తమిళనాడులోని అన్ని థియేటర్లు, మల్టీప్లెక్స్‌ నిర్వాహాకలు స్వచ్ఛదంగా మూసివేసారు.

 కరుణానిధికి నివాళిగా నిన్న ఫస్ట్ షోలతో పాటు  సెకండ్ షోలను కాన్సిల్ చేశారు. మరోవైపు ఈ రోజు ఏ థియేటర్స్ నడపబోమంటూ తమిళనాడులోనిన థియేటర్స్ యాజమాన్యాలు ప్రకటించాయి. మరోవైపు కలైంజర్ మరణంతో కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2’ రిలీజ్‌పై ఎఫెక్ట్ పడే అవకాశాలున్నాయి. ఇండస్ట్రీలోనే కాదు రాజకీయ పరంగా కూడా కరుణానిధితో కమల్ హాసన్ కి ఎంతో అనుబంధం ఉంది. 


ఇలాంటి సమయంలో తన సినిమా రిలీజ్ చేస్తే..తప్పుడు సంకేతాలు పోతాయని..భవిష్యత్ లో రాజకీయాలకు కూడా ఇబ్బంది కలుగుతుందని భావిస్తున్నట్లు తెలుస్తుంది.   ‘విశ్వరూపం2’ను కమల్ వాయిదా వేసే అవకాశం లేకపోలేదని చెన్నై ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.  ఫిబ్రవరిలో  కమల్ హాసన్ కొత్త పార్టీ ప్రకటించే ముందు కరుణానిధి ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: