మహేష్ మహర్షి చుట్టూ సెక్యూరిటీ !

Seetha Sailaja
మహేష్ పుట్టినరోజు సందర్భంగా తన అభిమానులకు జోష్ ను ఇవ్వడానికి కొద్ది సేపటి క్రితం మహేష్ వంశీ పైడిపల్లిల మూవీ టైటిల్ ను అధికారికంగా అనౌన్స్ చేసారు. అందరూ ఊహించినట్లుగానే ఈమూవీ పేరును రిషీ గా కాకుండా మహర్షి గా ప్రకటించారు. 

ఈమూవీలో లోని మహేష్ పాత్ర పేరు మహర్షి అయితే అందరు ముద్దుగా రిషీ అని పిలుస్తారు. మహేష్ ‘భరత్ అనే నేను’ లో కనిపించిన లుక్ కు విరుద్ధంగా ఈలుక్ ను వంశీ పైడిపల్లి డిజైన్ చేయడంతో మహేష్ అభిమానులు ఈ పుట్టినరోజు కానుకను చూసి మురిసిపోతున్నారు. 

ఇది చాలదు అన్నట్లుగా ఈరోజు విడుదల కాబోతున్న ఈమూవీ టీజర్ కు సంబంధించి దర్శకుడు వంశీ పైడిపల్లి తీసుకున్న జాగ్రత్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఈరోజు ఉదయం 9గంటల 9నిముషాలకు విడుదల కాబోతున్న ఈమూవీ టీజర్ ఎక్కడా ముందుగా లీక్ కాకుండా వంశీ పైడిపల్లి కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నాడు. 

సాధారణంగా ఒక టాప్ హీరో మూవీ టీజర్ ను ఫైనల్ చేసిన తరువాత ఆ టీజర్ ను ఆసినిమా యూనిట్ లోని కీలకమైన వారికి షేర్ చేయడంతో పాటు ఆమూవీకి సంబంధించిన డిజిటల్ పబ్లిసిటీ వింగ్ కు ముందుగా ఇవ్వడం అప్ లోడ్ చేయించడం వంటివి జరుగుతాయి. అయితే ఇవన్నీ పాటించకుండా వంశీ పైడిపల్లి ఈరోజు ఉదయం 6 గంటల నుండి తన సమక్షంలోనే ఈ టీజర్ కు సంబంధించిన అప్ లోడింగ్ జరిగేడట్లుగా చూసుకుని ఎక్కడా ఎటువంటి లీకులు లేకుండా విడుదల కాబోతున్న ఈ టీజర్ కు వంశీ పైడిపల్లి అనుసరిస్తున్న సెక్యూరిటీ జాగ్రత్తలు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: