శ్రీరెడ్డి వ్యవహారం మీద స్పందించిన ఆండ్రియా... నాకు ఆ అనుభవం ఎదురు కాలేదు..!

Prathap Kaluva

శ్రీరెడ్డి రేపిన కాస్టింగ్ కౌచ్ వివాదం సినీ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపింది. శ్రీరెడ్డి పలువురు ఇండస్ర్టీ వ్యక్తుల మీద సంచలన ఆరోపణలు చేసింది. దీనితో ఈ విషయం మీద చాలా మంది హీరోయిన్స్ తమ కు ఎదురైనా అనుభవాలను, అభిప్రాయాలను మీడియా తో పంచు కున్నారు.   తాజాగా శ్రీరెడ్డి ఆరోపణలపై నటి, గాయని ఆండ్రియా స్పందించింది.  ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు ఎంతో ధైర్యం అవసరమని ఆండ్రియా చెప్పుకొచ్చింది.


శ్రీరెడ్డి వివాదాల గురించి తనను ప్రశ్నిస్తూ ఉంటారని... ఆమె చెబుతున్న వాటిలో నిజం ఉంటే, వాటిని బహిరంగపరచడానికి ఆమెకు ఎంతో ధైర్యం కావాలని చెప్పింది.ఎవరికైనా అలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు, వాటిని కచ్చితంగా బయటపెట్టాలని సూచించింది. ఇలాంటి ఘటనలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పింది. తనకైతే ఇంతవరకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని వెల్లడించింది.


మహిళల బలహీనతలను అడ్డం పెట్టుకొని లైంగిక వేధింపులకు పాల్పడటం సరికాదు అని అండ్రియా చెప్పుకొచ్చింది. తాజాగా లోకనాయకుడు కమలహాసన్ సరసన ఆండ్రియా నటించిన 'విశ్వరూపం-2' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఈ చిత్రంలో నటించిన తరువాత తనలో సామాజిక బాధ్యత ఎక్కువైందని వెల్లడించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: