పవన్ కళ్యాణ్ పూజ గదిలో బైబిల్ !

Seetha Sailaja
ప్రజా పోరాట యాత్ర చేస్తూ జనం మధ్య తిరుగుతున్న పవన్ కళ్యాణ్ తన మాటలలో వేడి పెంచడమే కాకుండా తన రాజకీయ వ్యూహాలలో పదును పెంచుతూ అన్ని వర్గాల ప్రజలకు దగ్గర కావడానికి పవన్ అనేక ఎత్తుగడలు వేస్తున్నాడు. ఇప్పటి వరకు కేవలం యూత్ లో మాత్రమే వివరీతమైన ఫాలోయింగ్ ఉన్న పవన్ రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాపు సామాజిక వర్గాన్ని అదేవిధంగా మహిళలకు దగ్గర కావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ తనలో వచ్చిన మార్పును అందరికీ తెలిసేలా చేస్తున్నాడు. 

ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో తన పోరాట యాత్ర కొనసాగిస్తున్న పవన్ నిన్న భీమవరంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన ‘రూపాంతరం’ చర్చిలోకి వెళ్ళి అక్కడ తనను చూడడానికి వచ్చిన క్రిస్టియన్ సోదరులతో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. తాను చిన్నప్పటి నుంచి బైబుల్ చదవడం అలవాటు చేసుకున్నానని ఈ అలవాటు వల్ల తనకు రాగద్వేషాలు అసూయామాశ్చర్యాలు పూర్తిగా తొలిగిపోయాయి అంటూ కామెంట్స్ చేసాడు. 

అంతేకాదు బైబుల్ చదివేవారికి ప్రసాంతతో పాటు క్షమించే శక్తి కూడా వస్తుందని తన పూజగదిలో భగవద్గీతతో పాటు బైబుల్ కూడ ఉంటుంది అన్న ఆసక్తికర విషయాన్ని లీక్ చేసాడు. అదేవిధంగా తన కూత్రుకు క్రిష్టియన్ మతం భాప్టీజమ్ ఇచ్చిన విషయాన్ని వివరిస్తూ తనకు అన్ని మతాలు అదేవిధంగా అన్ని కులాలు ఒకటే అంటూ తన సమసిద్దాంతాన్ని అందరికీ తెలియచేసాడు. 

ఒకవైపు తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తాడో చెప్పకపోయినా పవన్ పోరాట యాత్ర చేస్తున్న ప్రతి ఊరిలోని స్థానిక సమస్యల పై మాట్లాడుతూ ఉన్న నేపధ్యంలో పవన్ ‘జనసేన’ ఆలోచనలు రాష్ట్ర స్థాయిలో లేకుండా స్థానిక సమస్యల చుట్టూ ఉండటంతో ఈ కొత్త వ్యూహం వెనుక అర్ధాలు ఏమిటి అనీ రాజకీయ వర్గాలు విస్తుపోతున్నాయి. ఇది ఇలా ఉండగా ఆగష్టు 14వ తారీఖున అర్థరాత్రి పవన్ ప్రకటించబోయే ‘జనసేన’ మేనిఫెస్టో గురించి పవన్ అభిమానులతో పాటు రాజకీయ వర్గాలు కూడ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: