వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ఫస్ట్‌లుక్ అదుర్స్!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలోకి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో..మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ‘ముకుంద’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  ఆ తర్వాత కంచె చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు.  తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా విజయం సాధించకున్నా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ఘనవిజయం తర్వాత ‘తొలిప్రేమ’ మంచి సక్సెస్ అందుకుంది. దాంతో ఇప్పుడు ఇండస్గ్రీలో ఈ మెగా కుర్రాడు బిజీ హీరోగా మారాడు.  ‘ఘాజీ’ దర్శకుడు సంకల్ప్ రెడ్డి‌తో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

స్పేస్ అడ్వంచర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఏం పేరు పెడతారా అని మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదరు చూస్తున్న విషయం తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవ వేడుక సందర్భంగా సినీ ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తూ.. వివిధ సినిమాల ఫస్ట్ లుక్, టీజర్‌లతో శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నారు హీరోలు, దర్శకులు. ఇప్పటికే ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ టీజర్ నెట్టింట్లో సందడి చేస్తుండగా.. క్రిష్ ‘మణికర్ణిక’ ఫస్ట్‌లుక్ కూడా నేడే విడుదలైంది.

తాజాగా వరుణ్ తేజ్ తన అప్ కమింగ్ మూవీ ఫస్ట్‌లుక్, టైటిల్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తూ.. ప్రేక్షకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేశారు.  అంతరిక్షంలో శాటిలైట్‌కు దగ్గరగా ఓ వ్యోమగామి పోస్టర్‌లో కనిపిస్తున్నాడు.  ‘ఘాజీ’ సినిమాతో అండర్ వాటర్ థ్రిల్లర్‌ను చూపించిన దర్శకుడు సంకల్ప్.. ఇప్పుడు ఈ చిత్రంతో ప్రేక్షకులను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు.  ఆదిత్యరావు హైదరి, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫస్ట్‌ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం కింద సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. 
Bringing you all an out of the world experience.
The first look and title of my next film. #Antariksham9000kmph #అంతరిక్షం9000kmph#HappyIndependenceDay pic.twitter.com/8SKwbJxCie

— Varun Tej Konidela (@IAmVarunTej) August 15, 2018Unveiling the title of an enthralling space adventure on this Independence Day.🇮🇳🇮🇳🇮🇳
Lift off at 9:30AM on the 15th of August...#SankalpReddy@aditiraohydari @Itslavanya@gnanashekarvs @FirstFrame_Ent pic.twitter.com/v8R3nLqOWR

— Varun Tej Konidela (@IAmVarunTej) August 12, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: