గీత గోవిందం కు దూరం జరిగిన వాట్సాప్ !

Seetha Sailaja
టెక్నాలజీ వాడకం అన్ని రంగాలలోను పెరిగిపోతున్న నేపధ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ కూడ ఈ సరికొత్త టెక్నాలజీ విషయంలో తనకు తానుగా మార్పులు చేసుకుంటోంది. అయితే గత కొంతకాలంగా ఈ టెక్నాలజీ వాడకం వల్ల జరుగుతున్న సంఘటనలతో టాలీవుడ్ ఇండస్ట్రీ టెక్నాలజీని పక్కకు పెట్టి తిరిగి పాత పద్ధతులకు వెళ్ళిపోతే మంచిది అన్న ఆలోచనలలో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నట్లు టాక్. 

ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే ఈమధ్య కాలంలో ‘గీత గోవిందం’ ‘అరవింద సమేత’ ‘టాక్సీ వాలా’ సినిమాలను పైరసీ లీకులు షేక్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఒక సినిమా స్టార్ట్ అయిన వెంటనే ఆసినిమాలోని కీలక యూనిట్ సభ్యుల మధ్య ఒక వాట్సప్ గ్రూప్ రెడీ అయిపోయేది. ఈ గ్రూప్ ద్వారానే ఆసినిమా యూనిట్ సభ్యులు ఆసినిమాకు సంబంధించిన కీలక సమాచారాన్ని  ఫోటోలను వీడియోలను ఒకరికి ఒకరు షేర్ చేసుకుంటూ హడావిడి చేసేవారు. 

ముఖ్యంగా సినిమాల టీజర్ల రఫ్ కట్, ట్రయిలర్ల రఫ్ కట్ లాంటి విషయాలు అన్నీ వాట్సప్ ద్వారానే చలామణీ అయ్యే వాతావరణం ఏర్పడింది. అయితే ‘గీత గోవిందం’ ‘అరవింద సమేత’ నేర్పిన పాఠాలతో ఇప్పుడు హీరోలు డైరక్టర్ల దగ్గరకు లాప్ టాప్ లు వెళ్తున్నాయని టాక్. 

లాప్ టాప్ ల్లోనే సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు షేర్ చేస్తూ ఎక్కడా లీకులు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. అవసరం అయితే నమ్మకమైన మనిషిని ఇచ్చి కారులో లాప్ టాప్ పంపిస్తున్నట్లు సమాచారం.  ఇలా అనుకోకుండా టెక్నాలజీ వాడకానికి ‘హీత గోవిందం’ ‘అరవింద సమేత’ లు బ్రేక్ వేసాయి అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: