చరణ్ చేసిన పొరపాట్ల వెనుక వ్యథ !

Seetha Sailaja
నిన్న జరిగిన ఇండిపెండెన్స్ డే సందర్భంగా రామ్ చరణ్ తాను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ కు వెళ్లి అక్కడి విధ్యార్ధులతో మాట్లాడిన విషయాలు మీడియాకు లీక్ అయ్యాయి. ఈమధ్య కాలంలో అనేక మంది విద్యార్ధులు ఫెయిల్యూర్స్ ను తట్టుకోలేక డిప్రషన్ కు గురి అవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపధ్యంలో ఆవిషయాలను విద్యార్ధులతో ప్రస్తావిస్తూ విజయం వస్తే పొంగిపోవడం అపజయం వస్తే కృంగిపోవడం మంచిది కాదు అంటూ తన జీవితాన్ని ఒక ఉదాహరణగా విద్యార్ధులకు వివరించాడు చరణ్. 

తన కెరియర్ లో కొన్ని డిజాస్టర్లు వచ్చిన విషయాన్ని వివరిస్తూ ఒక టైమ్ లో చాలా రోజులు బెడ్ రూమ్ నుంచి నేను బయటకు కూడా రాలేదు అన్న విషయాన్ని చరణ్ గుర్తుకు చేసుకున్నాడు.  అంతేకాదు తన బ్రేక్ ఫాస్ట్, లంచ్ అన్నీ తన బెడ్ రూమ్ లోనే నడిచాయని తన అమ్మ మాత్రమే తన రూమ్ లోకి వచ్చిన సందర్భాన్ని వివరిస్తూ ఆ టైమ్ లో ప్రపంచం మొత్తం తన మీద పడిపోతున్నట్టు అనిపించిన విషయాలను విద్యార్ధులతో షేర్ చేసుకున్నాడు చరణ్. 

అదేవిధంగా చదువులో మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన బెంగ పడిపోవనక్కరలేదని తప్పులు చేసినప్పుడే కొత్త విషయాలు తెలుస్తాయి అంటూ విద్యార్ధులకు ఆత్మస్తైర్య్యాన్ని నూరి పాడాడు రామ్ చరణ్. అంతేకాదు ఎవరైనా తప్పులు చేయడానికి భయపడకూడదు అంటూ  తప్పులు చేస్తూనే ఉండాలి అంటూ విద్యార్ధులను మోటివేట్ చేసిన చరణ్ లో ఒక వ్యక్తిత్వ వికాశనిపుణుడు కనిపించాడు. 

 అంతేకాదు ఫెయిల్యూర్స్ ను ఎప్పుడు అంగీకరిస్తామో మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి ఒక  ఛాన్స్ దొరికినట్లే అని చరణ్ అన్న మాట్టలు అక్కడి విద్యార్ధులకు బాగా నచ్చడంతో చరణ్ స్పీచ్ కి అక్కడి స్టూడెంట్స్ జోష్ లోకి వెళ్లి పోయారు. ప్రస్తుతం చరణ్ లో  వచ్చిన ఆలోచనల పరిపక్వతకు ఈమాటలు నిదర్శనంగా ఉన్నాయి అంటూ ఆకార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా వర్గాలు కామెంట్స్ చేసినట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: