రేర్ కాంబోతో సూపర్ స్టార్ మహేష్ !!

Satya
సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ రేర్ కాంబొ రాబోతోందని టాలీవుడ్ టాక్. మహేష్ తో ఇంతకు ముందు ఎపుడూ మూవీ తీయని ఓ బడా ప్రొడ్యూసర్ మహేష్ డేట్స్ రిజర్వ్ చేసుకున్నడని భోగట్టా. గతంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్లు కొట్టిన ఆ నిర్మాత మహేష్ తో తీయాలని అనుకోవడమే తడవుగా మహేష్ కూడా ఎస్ అనేశాడని అంటున్నారు.


ఆ బిగ్ హౌసేనా :


టాలీవుడ్ లో ఉన్న టాప్ లెవెల్ మెగా ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ మహేష్ నెక్స్ట్ మూవీ ప్రొడ్యూసర్ అని అంటున్నారు. ఇప్పటికే గీతా గోవిందం హిట్ తో మాంచి స్పీడ్ మీద ఉన్న అరవింద్ వెంటనే నాగబాబు కొడుకు వరుణ్ బాబు తో ఓ లో బడ్జెట్ మూవీ తీస్తున్నాడుట. అది కంప్లీట్ అవగానే మహేష్ తో మూవీ ఉంటుందని అంటున్నారు.


మెగా కాంపౌండ్ తో క్లోజ్ :


మహేష్ బాబు ఈ మధ్య కాలంలో మెగా కాంపౌండ్ కి  బాగా క్లోజ్ అయ్యారు. మెగా వారసుడు రాం చరణ్ తో మంచి దోస్తీ చేస్తున్న మహేష్ రీసెంట్ గా అరవింద్ రిలీజ్ చేసిన గీతా గోవిందం మూవీని చూసి బాగుందని చెప్పేశాడు.  అలా బయట మూవీస్ చూసి కామెంట్ చేయడం మహేష్ కి అంతగా అలవాటు లేని వ్యవహారం. అది అరవింద్ మూవీ కావడమే మహేష్ అలా చేశాడని అంటున్నారు.


ఇలా ఆ కాంపౌండ్ కి బాగా దగ్గర అవుతున్న మహేష్  బాబు తన 25వ  ప్రెస్టేజియస్ మూవీ కాగానే అరవింద్ సినిమాకు రెడీ అంటారని టాక్. ఇప్పటి వరకు బయట టాప్ హీరోలతో వర్క్ చేయని అరవింద్, అలాగే మెగా ఫ్యామిలీ ప్రొడ్యూసర్  మహేష్ కలవడం ఓ సెన్సేషన్ అంటున్నారు. మహేష్ కోసం మంచి స్క్రిప్ట్ రెడీగా  పెట్టుకున్న అరవింద్ తమ రేర్ కాంబో ని  వావ్ అనిపించేలా మూవీ తీసి చూపిస్తాడంటున్నారు. మరి చూడాలి.. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ మూవీ నిర్మిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: