గీత గోవిందం సక్సస్ మీట్ లో పవన్ ప్రస్తావన !

Seetha Sailaja
నిన్నరాత్రి జరిగిన ‘గీత గోవిందం’ సక్సస్ మీట్ కు ముఖ్య అతిధిగా వచ్చిన చిరంజీవి విజయ్ దేవర కొండను ఆకాశంలోకి ఎత్తేస్తూ మాట్లాడటమే కాకుండా పవన్ తరువాత ఆ స్థాయి అదృష్ట వంతుడు విజయ్ దేవర కొండ అంటూ కామెంట్స్ చేసాడు. పవన్ ‘అత్తారింటికి దారేది’ విడుదలకు ముందు లీక్ అయిన తరువాత ఆమూవీ బ్లాక్ బస్తర్ హిట్ అయిన విషయాన్ని గుర్తుకు చేస్తూ అలాంటి సెంటిమెంట్ ‘గీత గోవిందం’ కు రిపీట్ కావడంతో విజయ్ కు పవన్ స్థాయి అదృష్టంతో పాటు యూత్ లో పవన్ స్థాయిలో మ్యానియా ఏర్పడింది అంటూ విజయ్ క్రేజ్ పై షాకింగ్ కామెంట్స్ చేసాడు మెగా స్టార్.

ఇదే సక్సస్ మీట్ లో మరో అతిధిగా వచ్చి మాట్లాడిన దిల్ రాజ్ విజయ్ ను ఏకంగా పవన్ కళ్యాణ్ తో సరి సమానంగా పోలుస్తూ పవన్ తరువాత స్థాయి విజయ్ ది మాత్రమే అని అర్ధం వచ్చేలా కామెంట్స్ చేసాడు. 20 సంవత్సరాల క్రితం యూత్ లో పవన్ కు ఎటువంటి క్రేజ్ ఉండేదో అటువంటి క్రేజ్ ఇప్పుడు విజయ్ దేవరకొండకు ఏర్పడింది అంటూ విజయ్ మ్యానియాను పవన్ మ్యానియాతో సరి సమానం చేసాడు దిల్ రాజ్.

ఇలా నిన్న జరిగిన ‘గీత గోవిందం’ సక్సస్ మీట్ అంతా విజయ్ క్రేజ్ ను పవన్ క్రేజ్ తో పోలుస్తూ జరగడంతో చిరంజీవి నుండి అల్లు అర్జున్ వరకు విజయ్ దేవరకొండను మెగా హీరోలతో సరిసమానంగా అభిమానిస్తున్నారు అన్న విషయాన్ని తెలిపే వేదికగా మారింది. దీనితో ఇప్పటి వరకు కేవలం మెగా హీరోల ఫంక్షన్స్ లో మాత్రమే వినిపించే పవన్ నామస్మరణ నిన్నటి ‘గీత గోవిందం’ సక్సస్ మీట్ లో కూడ వినిపించడంతో విజయ్ ని అభిమానించే మెగా హీరోల లిస్టులో పవన్ కళ్యాణ్ కూడా చేరినట్లు అయిపోయింది. 

ఇది చాలదు అన్నట్లుగా ఈమూవీ మొదటి మూడు రోజులలో 34 కోట్ల కలక్షన్స్ గ్రాస్ మార్క్ ను అందుకుంటే నిన్నటితో ముగిసిన వీక్ ఎండ్ తో ఈమూవీ గ్రాస్ కలక్షన్స్ 50 కోట్ల మార్క్ ను అందుకోవడం ఖాయం అని అంటున్నారు. యూత్ లో ఒకవైపు విజయ్ కు ఏర్పడిన మ్యానియాతో పాటు మెగా కాంపౌండ్ పరిపూర్ణ మద్దతు విజయ్ దేవరకొండకు సంపూర్ణంగా లభించడంతో ఈక్రేజీ హీరో రేంజ్ ఎవరికీ అందని స్థాయిలో పరుగులు తీస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: