నాగార్జున టాప్ హీరోగా కొనసాగుతూనే అక్కినేని ఇంటి పెద్దగా తన వారసులు నాగ చైతన్య అఖిల్ ల సినిమా కెరియర్ ల విషయంలో పూర్తి గా శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఇదిచాలదు అన్నట్లుగా తన మేనల్లుడు సుశాంత్ సుమంత్ మేనకోడలు సుష్మిత సినిమాల ఎంపికలో కూడ తన సలహాలు అందిస్తూ అవసరం అనుకుంటే ఆ సినిమాలను ప్రమోట్ చేస్తున్నాడు.
ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు నాగార్జునకు సమంతను ఆదుకోవలసిన పరిస్థితులు ఏర్పడాయి అని వార్తలు వస్తున్నాయి. వివరాలోకి వెళ్ళితే సమంత నటించిన ‘యూటర్న్’ సెప్టెంబర్ లో విడుదలకు రెడీ అవుతోంది. థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈమూవీ టీజర్ కు మంచి స్పందన వచ్చినా ఈమూవీకి ఇంకా బిజినెస్ కాలేదని తెలుస్తోంది.
ఈసినిమా ఏరియా బిజినెస్ పూర్తి కాకపోవడానికి ఈ సినిమా నిర్మాతలు సమంత క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని చెపుతున్న రెట్లు అని అంటున్నారు. కేవలం ఒక ఆంధ్రా ఏరియాకు ఈమూవీకి సంబంధించి 5కోట్లు ఈమూవీ నిర్మాతలు కోట్ చేయడంతో బయ్యర్లు భయపదిపోతున్నట్లు టాక్. ఇలా ఈమూవీ నిర్మాతలు వ్యవహరించడానికి ఈమూవీ పై పెట్టిన ఖర్చు అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ పై నిర్మాతలు 10 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.
ఇలాంటి పరిస్థుతులలో ఇంకా మార్కెట్ కాని ఈసినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా విడుదల చేసి తన మూవీని రక్షించ వలసిందిగా సమంత నాగార్జున పై ఒత్తిడి చేసినట్లు టాక్. అయితే ‘శైలజా రెడ్డి అల్లుడు’ విడుదల సెప్టెంబర్ మొదటి వారానికి మారడంతోపాటు తన ‘దేవదాస్’ మూవీ విడుదల కూడ సెప్టెంబర్ లోనే ఉండటంతో ఇప్పుడు సమంత సినిమాను కూడ తనంతట తానుగా సెప్టెంబర్ రేస్ లో దింపడం ఎంత వరకు శ్రేయస్కరం అన్న ఆలోచనలో నాగార్జున ఉన్నట్లు సమాచారం..