దటీజ్ నయనతార!

Edari Rama Krishna
సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ‘చంద్రముఖి’చిత్రంలో నటించి  తన కంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న నటి నయనతార.  ఆ తర్వాత వచ్చిన గజిని చిత్రంలో హాట్ హాట్ గా కనిపిస్తూ కుర్రాళ్ల మనసు దోచింది.  ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు దక్షిణాది హీరోయిన్లలో నెంబర్ వన్ రేసులో దూసుకు పోతున్న నయనతార రెమ్యూనరేషన్ కూడా అందరికన్నా ఎక్కువే.

  స్టార్ హీరోలతోనే కాదు .. యువ కథానాయకులతోను జోడీ కడుతూ నయనతార అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. సీనియర్ దర్శకులతోనే కాదు, కొత్త దర్శకులకి కూడా ఆమె ఎంతో ధైర్యంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ ఉంటుంది.  తాజాగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'కొలమావు కోకిల' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ నెల 17వ తేదీన ఈ సినిమా తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ఈ చిత్రం 10 కోట్ల రూపాయలను రాబట్టేసి, నయనతార సత్తాను మరోమారు చాటిచెప్పింది. ఇక కథ విషయానికి వస్తే..క్యాన్సర్ తో బాధపడే తన తల్లిని రక్షించుకోవడానికి ఓ యువతి  డ్రగ్స్ మాఫియాలోకి దిగే పాత్రను నయనతార పోషించింది. డ్రగ్స్ ను సప్లయ్ చేసే పాత్రలో ఆమె నటన అద్భుతమనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. ఇక తెలుగులో  'కో కో కోకిల' అనే పేరుతో  రాబోతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: