విజయ్ దెబ్బకు నాని గేమ్ ప్లాన్ మార్చాడా..!

shami
కనబడానికి క్లోజ్ గా ఉన్నా హీరోల మధ్య సినిమాల ఫలితాల పోటీ బాగా ప్రెజర్ తెస్తుంది. అది స్టార్ హీరోల మధ్యన మాత్రమే కాదు యువ హీరోల మధ్య కూడా ఉంటుంది. లేటెస్ట్ యువ సంచలనం విజయ్ దేవరకొండ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చేస్తున్న హంగామాకు స్టార్ ఫ్యూజులే ఎగిరిపోయేలా ఉన్నాయి.


అయితే విజయ్ కు మొదటి ఛాన్స్ ఇచ్చిన నాని మీద ఈ ఎఫెక్ట్ బాగా పడిందని తెలుస్తుంది. నాని, విజయ్ కలిసి నటించిన ఎవడే సుబ్రమణ్యం సినిమాలో నాని హీరో విజయ్ సపోర్టింగ్ రోల్. ఆ తర్వాత మూడంటే మూడే సినిమాలతో మెగాస్టార్ చిరంజీవితోనే విజయ్ ది స్టార్ హీరో అనేలా సత్తా చాటాడు. 


ఇక ఇప్పుడు విజయ్ క్రియేట్ చేస్తున్న రికార్డులను ముందు నాని టార్గెట్ పెట్టుకున్నాడు. అందుకే తన సినిమాల సెలక్షన్స్ లో మరింత జాగ్రత్త పడుతున్నాడు. ఈమధ్య నాని హిట్లు కొడుతున్నా రొటీన్ గా వెళ్తున్నాడనే టాక్ వచ్చింది. అందుకే ఇక మీదట స్టోరీ నచ్చకుంటే మొహమాటం లేకుండా నో చెప్పేస్తున్నాడట. 


ఈ క్రమంలో అవసరాల శ్రీనివాస్ తో నాని చేయాల్సిన సినిమా వద్దని చెప్పాడట. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిస్క్ ఎందుకని నాని ఆ సినిమా వదులుకున్నాడట. నాని చేస్తాడని ఇన్నాళ్లు ఎదురుచూసిన అవసరాల శ్రీనివాస్ ఆ సినిమాను నిఖిల్ తో చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. మొత్తానికి విజయ్ దెబ్బకు నాని గేం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: