నందమూరి అన్నదమ్ములు సోమవారం నుంచి డ్యూటీ లోకి...!

Prathap Kaluva

హరికృష్ణ చనిపోయిన భాదలో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఉన్నారు అయితే ఇప్పటీకే తాము నటిస్తున్న సినిమాలు వాయిదా పడతాయని అందరూ భావించారు అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరూ అన్నదమ్ములు సోమవారం నుంచి షూటింగ్ షెడ్యూల్ లో చేరుతున్నట్టు తెలుస్తుంది. వర్క్ కల్చర్, తండ్రి నేర్పిన మంచి విషయాలు, తాత పాటించిన మంచి నియమాలు కారణంగా నందమూరి సోదరులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోమవారం నుంచే షూటింగ్ లకు వెళ్తున్నారు. ఇది ఓ గొప్ప విషయం. 


 నిజానికి ఇద్దరు బ్రదర్స్ సినిమా షూటింగ్ లకు వెళ్లక తప్పని పరిస్థితి. ఎందుకంటే అరవింద సమేత వీరరాఘవ దసరాకు విడుదల కావాలి. ఒక్క నిమిషం కూడా వర్క్ ఆగకుండా చేస్తేనే అది సాధ్యం అవుతుంది. అప్పటికీ కాస్త టెన్షనే. అలాంటిది. అయిదు రోజులు పాటు హీరో షూటింగ్ కు రాకపోతే, సినిమా రిలీజ్ రిస్క్ లో పడుతుంది. అందుకే ఎన్టీఆర్ షూటింగ్ కు వెళ్లక తప్పదు.


ఇక కళ్యాణ్ రామ్. ఆయన వచ్చే నెల నుంచి ఎన్టీఆర్ బయోపిక్ మీదకు వెళ్తున్నారు. దాదాపు 26 రోజులు షూటింగ్. ఈ లోగా ప్రస్తుతం చేస్తున్న గుహన్ డైరక్షన్ సినిమా పూర్తి చేయాలి. లేదంటే ఆ సినిమా మళ్లీ ఇప్పట్లో పూర్తికాదు. అందుకే ఆయన కూడా షూటింగ్ కు వెళ్లాలి. ఏది ఏమైనా తండ్రి మరణించిన ఆ భాద నుంచి ఇంకా కోలుకోలేక పోయిన ఇలా ఇద్దరూ షూటింగ్ కు వెళుతున్నడటం అభినందించదగ్గ విషయం. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: