పుట్టినరోజునాడు బయటపడ్డ పవన్ ఫస్ట్ లవ్ తిరస్కరణ విశేషాలు !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అసలు పవన్ హీరో అవ్వకముందు చెన్నైలో కంప్యూటర్ క్లాస్ లకు వెళుతున్న రోజులలో పవన్ ఒక అందమైన అమ్మాయిని ప్రేమించిన సంగతి పవన్ పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక ఈరోజు బయట పెట్టింది. 

ఆపత్రిక కథనం ప్రకారం పవన్ కంప్యూటర్ క్లాస్ కు వెళ్ళే ఆనాటి రోజులలో ఆక్లాస్ కు ఒక అందమైన అమ్మాయి కూడ వచ్చేదట. అంతేకాదు ఆఅమ్మాయి పవన్ తో చాల క్లోజ్ గా కూడ మాట్లాడేదట. వీరిద్దరి సాన్నిహిత్యం బాగా పెరగడం గమనించిన అప్పటి పవన్ స్నేహితులు ఆ అమ్మాయి పవన్ ను ప్రేమిస్తోందని అభిప్రాయపడి పవన్ ను కూడ ఈవిషయంలో ముందడుగువేయమని స్నేహితులు ప్రోత్సహించడంతో పవన్ ధైర్యం తెచ్చుకుని ‘ఐ లవ్ యూ’ చెప్పినప్పుడు పవన్ కు ఆఅమ్మాయి ఇచ్చిన సమాధానాన్ని ఆపత్రిక ఈరోజు ప్రచురించింది. 

పవన్ ఒక మంచిరోజు చూసుకుని తనఇంటిలో వాడకుండా వదిలేసిన ఒక డొక్కు కారును బయటకు తీసుకువెళ్ళి శుభ్రం చేయించి నీట్ గా తయారై ఆకారులో ఆ అమ్మాయి ఉండే ప్రదేశానికి వెళ్ళాడట. అక్కడ ఆఅమ్మాయిని తన కారులో పిక్ చేసుకుని కొంత దూరంవెళ్ళిన తరువాత ఇబ్బంది పడుతూ తాను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్న విషయాన్ని బయట పెట్టాడట. 

అయితే ఆవిషయాలు అన్నీ ఓపికగా విన్న ఆఅమ్మాయి పవన్ కు క్లాస్ టీచర్ లా మారిపోయి అసలు ప్రేమ అంటే ఏమిటి అనుకుంటున్నావు అంటూ పవన్ కు క్లాస్ పీకటమే కాకుండా ముందు కెరియర్ లో సెటిల్ అయిన తరువాత ప్రేమ గురించి ఆలోచిస్తాను అంటూ ఊహించని సమాధానం ఇవ్వడంతో పవన్ షాక్ అయిన విషయాన్ని ఆపత్రిక ఈ పుట్టినరోజునాడు బయటపెట్టింది. ఈరోజు 48వ పుట్టినరోజు జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ వచ్చే పుట్టినరోజునాటికి పవన్ ముఖ్యమంత్రి అవుతాడా? లేదంటే హీరోగానే కొనసాగుతాడా అన్నవిషయానికి క్లారిటీ వస్తుంది..   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: