చరణ్ విన్యాసంలో జనసేన జండా వెనుక ఆంతర్యం !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ చేస్తూ షేర్ చేసిన చరణ్ సాహస విన్యాసంకు సంబంధించిన వీడియోలో మెగా అభిమానులకు రాజకీయ కోణం కనిపిస్తోంది. ఈవీడియోలో కనిపించిన  పారాచూట్  పవన్  ‘జనసేన’ పార్టీ జెండాను తలపించేలా కలర్ ఉండటంతో త్వరలో తాను తన బాబాయ్ కోసం ‘జనసేన’ పార్టీలోకి రాబోతున్నాను అని సంకేతాలు ఇచ్చేలా ఉందని మెగా అభిమానులు అభిప్రయా పడుతున్నారు.  

గతంలో చరణ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తానూ తన బాబాయ్ ఎప్పుడు పిలిచినా ‘జనసేన’ తరుపున పనిచేయడానికి సిద్ధమే అని చెప్పిన మాటలకు కొనసాగింపుగా చరణ్ లేటెస్ట్ గా షేర్ చేసిన వీడియోలోని పారాచూట్ కలర్ కనిపిస్తోందని పవన్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. వాస్తవానికి రామ్ చరణ్ అభిమానులు ఈరోజు చరణ్ బోయపాటి సినిమా ఫస్ట్ లుక్ ఉంటుందని భావించారు. 

కానీ దానికి భిన్నంగా రామ్ చరణ్ పోస్టు చేసిన ఈ వీడియో  చరణ్ లోని సాహస ప్రవృత్తిని బయట పెట్టడమే కాకుండా ‘జనసేన’ పార్టీకి అవసరం అయితే తాను ఉన్నాను అని సంకేతాలు ఇచ్చే విధంగా ఉందని పవన్ అభిమానులు కూడ అంగీకరిస్తున్నారు. దీనితో పవన్ ఆశీస్సులతో భవిష్యత్తులో ఆయన స్థానాన్ని రామ్ చరణ్ భర్తీ చేయాలని కోరుకుంటూ పవన్ అభిమానులు ఈరోజు పండుగ చేసుకుంటున్నారు.

ఇప్పటికే రాజకీయాలలో పవన్ ఒంటరి వాడు కాదు అని మెగా కాంపౌండ్ సంకేతాలు ఇస్తున్న నేపధ్యం తెలిసిందే. మెగా స్టార్ గా ఒక వెలుగు వెలిగిన చిరంజీవి రాజకీయాలలో రాణించని  నేపధ్యంలో ఈలోటును తీర్చడంలో పవన్ చేసే ప్రయత్నాలకు చరణ్ రానున్న రోజులలో ఎలా సహకరిస్తాడో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: