మగధీర మ్యానియాతో తుడిచి పెట్టుకుపోతున్న బహుబలి రికార్డులు !

Seetha Sailaja
తొమ్మిది సంవత్సరాల క్రితం విడుదలైన ‘మగధీర’ ఒక ట్రెండ్ సెటర్. 100 సెంటర్లలకు పైగా 100 రోజులు ప్రదర్శింప బడ్డ ‘మగధీర’ రికార్డులను చరిత్ర సృష్టించిన ‘బాహుబలి’ కూడ బ్రేక్ చేయలేక పోయింది. అయితే ఇప్పుడు అనుకోకుండా ‘మగధీర’ ‘బాహుబలి 2’ కలక్షన్స్ కు చెక్ పెట్టేలా అడుగులు వేస్తూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

‘మగధీర’ విడుదల అయ్యే సమయంలో తెలుగు సినిమాలకు ఓవర్సీస్ లో మార్కెట్ లేదు. అదేవిధంగా ఎంత ఘన విజయం సాధించినా ఆసినిమాలను విదేశీ భాషలలో డబ్ చేసే అలవాటు అప్పట్లో లేదు. అయితే ‘బాహుబలి’ తరువాత తెలుగు సినిమా మార్కెట్ ప్రపంచ వ్యాప్తం కావడంతో ‘బాహుబలి’ విధానాలను అనుసరిస్తూ 9 సంవత్సరాల తరువాత ‘మగధీర’ ను జపాన్ భాషలోకి డబ్ చేసి గతవారం విడుదల చేసారు. 

అయితే అనూహ్యంగా ఈమూవీకి జపాన్ సినిమా ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవ్వడమే కాకుండా ఈమూవీ మొదటి వారం ఫస్ట్ వీకెండ్ కు దాదాపు ఒక మిలియన్ డాలర్లు కలక్షన్స్ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. చరిత్ర సృష్టించిన ‘బాహుబలి 2’ ను జపాన్ భాషలోకి డబ్ చేసి విడుదల చేస్తే ఆమూవీ రెండు వారాలకు 1.2 మిలియన్ డాలర్ల కలక్షన్స్ ఆమూవీ ఫుల్ రన్ లో వస్తే కేవలం విడుదలైన మూడు రోజులలో ‘మగధీర’ జపాన్ డబ్బింగ్ కు దగ్గర దగ్గర 1 మిలియన్ డాలర్లు రావడంతో ఈమూవీ జపాన్ తన టోటల్ రన్ పూర్తి పూర్తి చేసుకునే సరికి ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేయడం కాయం అని అంటున్నారు. 

వాస్తవానికి జపాన్ ప్రజలకు రజినీకాంత్ పేరు మాత్రమే తెలుసు. 21 సంవత్సరాల క్రితం విడుదలైన రజినీకాంత్ ‘ముత్తు’ మూవీ అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసి 1.6 మిలియన్ డాలర్ల కలక్షన్స్ ను కొల్లగొట్టింది. అయితే ఈ రికార్డ్ ను ‘బాహుబలి 2’ లాంటి భారీ సినిమా కూడ బ్రేక్ చేయలేకపోయినా ప్రస్తుతం ‘మగధీర’ కు జపాన్ ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ బట్టీ ఈమూవీ రజినీకాంత్ ‘ముత్తు’ రికార్డ్ లను బ్రేక్ చేసినా ఆశ్చర్యం లేదు అంటూ జపాన్ మీడియాలో వస్తున్న వార్తలకు మెగా ఫ్యామిలీ జోష్ లోకి వెళ్లి పోతోంది అని వార్తలు వస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: