అలాంటి పుకార్లు నమ్మొద్దు : సోనాలీ బింద్రే

Edari Rama Krishna
ఈ మద్య కాలంలో సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయం సెకన్లలో ప్రపంచ వ్యాప్తంగా తెలిసిపోతున్నాయి.  ముఖ్యంగా సెలబ్రెటీలకు సంబంధించిన ఎలాంటి విషయమైనా అది పాజిటీవ్..నెగిటీవ్ ఏదైనా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.   సోనాలి బింద్రే హైగ్రేడ్ మెటా స్టేటిక్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతూ న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఆమెకి క్యాన్స‌ర్ సోకింద‌నే వార్త‌ని ఇప్ప‌టికి అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు.  తాజాగా బాలీవుడ్ నటి సోనాలి బింద్రే చనిపోయిందంటూ వార్తలొచ్చాయి.

మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ కూడా ఇదే వార్తను ట్వీట్ చేస్తూ, ఆమెకు శ్రద్ధాంజలి కూడా ఘటించేశారు. వెంటనే తప్పు తెలుసుకున్న ఆయన తనకు వచ్చిన సమాచారం తప్పని పేర్కొంటూ, సోనాలి త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే కొంత మంది ఆకతాయిలు మాత్రం ఈ విషయాన్ని ఏదో సీరియస్ గా రక రకాలుగా పోస్ట్ లు చేస్తూ అభిమానులను కాంట్రవర్సీకి గురి చేస్తున్నారు.

తాజాగా ఈ విషయంపై స్పందించిన సోనాలీ బింద్రే భర్త భ‌ర్త గోల్డీ బెహెల్ తాజాగా ట్వీట్ చేశారు. సోష‌ల్ మీడియాని మ‌రింత బాధ్యతాయుతంగా వాడాలని దయచేసి నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. నా భార్య గురించి వ‌స్తున్న వదంతులు అస్స‌లు న‌మ్మోద్దు, వాటిని స్ప్రెడ్ చేయోద్దు. దీని వ‌ల్ల కొంద‌రి మ‌నోభావాలు దెబ్బ‌తింటాయ‌నే విష‌యం మ‌రువ‌ద్దు అని గోల్డీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. 
I appeal to all to please use social media more responsibly. Let us not believe in rumours and spread them, unnecessarily hurting the sentiments of those involved. Thank you.

— goldie behl (@GOLDIEBEHL) September 8, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: