సమంత చైతూల్లో ఎవరు గ్రేట్?


హిరో హిరొయిన్స్ భార్యా భర్తలై వాళ్ళ సినిమాలు విడులైతే చాలు వాటి మద్య ఏ సినిమా బాగుంది? ఎవరి సినిమా హిట్? ఎవరి సినిమా ఫట్? అనే చర్చ అభిమాన ప్రేక్షకుల్లోనే కాదు సామాన్య ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి రెట్టింపు ఔతుంది. అది నాటి సావిత్రీ  జెమిని గణేషన్ కాలం నుండి ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ ల వరకే కాదు ఇప్పుడు సమంత చైతూల వరకూ కొనసాగుతుంది. ఇది సహజం 

నేడు టాలీవుడ్ లో చిన్న సినిమాల ప్రభంజనం కొనసాగుతుంది. గత కొన్నాళ్లుగా అంటే పెళ్ళిచూపులు సూపర్ హిట్ తో వేదెక్కిన చిన్న సినిమాల హదావిడి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తుంది. ‘గీతగోవిందం’ నాలుగు వారాల నుంచి బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సామ్రాట్ గా నిలిచింది. ఇప్పుడు ‘కేరాఫ్ కంచరపాలెం’  సినిమా కూడా తన వంతుగా కలెక్షన్లను సంపాదించుకుంటుంది. 

నిన్న విడుదల అయిన రెండుసినిమాల ప్రభావంతో ఎదురులేకుండా నడుస్తున్న చాలా చిన్నసినిమాలు థియేటర్ల నుంచి మాయం అయ్యాయి. అటు ‘యూ టర్న్’ , ఇటు ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాలు మెజారిటీ సినిమాలను ఆక్రమించేశాయి. 

అయితే ఇప్పుడు ప్రేక్షకుల్లో పై రెండు సినిమాల పోటీ బాక్సాఫీస్ వద్ద "భార్యాభర్తల సినిమాల సమరం" గా కొనసాగుతోంది. ఈ సినిమాలు రెండింటిపైనా పాజిటివ్ అంచనాలే ఉన్నాయి. ఈ రెండు సినిమాలకూ 'టార్గెటెడ్ ఆడియన్స్ కూడా వేర్వేరు'. శైలజారెడ్డి అల్లుడు ప్రధాన లక్ష్యం బీ- సీ సెంటర్లు. మాస్ ప్రేక్షకగణం. అలాగే కొంత వరకూ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమా పట్ల ఆకర్షితులవుతున్నారు. 'అత్తా, అల్లుడు కాన్సెప్ట్ ఫ్యామిలీ ఆడియన్స్‌' ను ఆకట్టుకునే అంశమే. 

ఇక  ‘యూటర్న్’ పై ప్రధానంగా యూత్, మల్టీప్లెక్స్-ఆడియన్స్ అంటే క్లాస్ ఆడియన్స్ చూపు ఉంటుంది.  "సస్పెన్స్ థ్రిల్లర్" తరహా కథాంశాన్ని ఇష్టపడే వాళ్లు ఈ సినిమా పై ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉన్నారు. ఈ సినిమా ఇప్పటికే తన సత్తాను కన్నడలో నిరూపించుకుంది. కర్ణాటకలో సూపర్-హిట్ అయిన కథాంశం, కథనం ప్రత్యేకం కావడం తో తెలుగు వెర్షన్‌ కు కూడా 'మినిమం గ్యారెంటీ' ఉంటుందనే సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. 

ఏ సినీ పరిశ్రమ చరిత్రలో అయినా ఇలా "భార్యాభర్తల సినిమాలు" ఒకే రోజున అమీ తుమీ తలపడటం మాత్రం ఉండక పోవచ్చు. ఈ రకంగా చూస్తే ఇదో రేర్-ఫీట్. బాక్సాఫీస్‌ను హీటెక్కిస్తోంది ఈ ఈ భార్యాభర్తల సవాల్. ఈ యూటర్న్ సినిమా నిర్మాణంలో సమంత భాగస్వామ్యం కూడా ఉంది.   

అయితే ఇలాంటి పరిస్థితుల్లో అన్నీ సందర్భాల్లో కూడా ఎంతో కొంత హిరొయిన్ దే కాస్త పైచేయి ఔతుంది. ఇప్పుడూ అదే జరిగింది అనే ప్రేక్షకులు ఉన్నారు. అయితే శైలజారెడ్డి అల్లుడు సినిమా తో చైతూ కొంత 'మాస్ -ఫామిలీ హీరో' అయ్యే సూచన లు కనిపిస్తున్నాయి. సమంత మాత్రం ఎప్పుడో  'వెర్సటైల్ హీరోయిన్' గానే స్థిరపడి పోయింది. ఇప్పుడు 'యూ-టర్న్' తో అభి రుచి ఉన్న నిర్మాణ భాగస్వామి గా కూడా నిరూపించుకుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: