షాకింగ్ అరవింద సమేత విడుదల డేట్ పై నెగిటివ్ సెంటిమెంట్ !

Seetha Sailaja
‘అరవింద సమేత’ మూవీని అనుకున్న రిలీజ్ డేట్ అయిన అక్టోబర్ 11న విడుదల చేయడానికి జూనియర్ త్రివిక్రమ్ లు విపరీతంగా కష్టపడుతూ ఉంటే ఈమూవీని అనుకున్న అక్టోబర్ 11న కాకుండా ఒకరోజు ముందుగా కానీ లేకుంటే ఒకరోజు వెనుక కానీ విడుదల చేయమని జూనియర్ వీరాభిమానులు కోరుతూ ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి విచిత్ర కోరిక జూనియర్ అభిమానులలో ఏర్పడటం వెనుక ఒక నెగిటివ్ సెంటిమెంట్ ఉంది.

ఐదు సంవత్సరాల క్రితం 2013 అక్టోబర్ 11న జూనియర్ నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ విడుదలైంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈమూవీ జూనియర్ కెరియర్ లో పెద్ద ఫ్లాప్ గా రికార్డ్ క్రియేట్ చేసుకుంది. తిరిగి అటువంటి ఫెయిల్యూర్ డేట్ ను జూనియర్ త్రివిక్రమ్ లు కలిసి ఎందుకు ఎంచుకున్నారు అంటూ జూనియర్ అభిమానులు తీవ్ర కలవరపాటును ప్రదర్శిస్తున్నారు. 

దీనితో సెంటిమెంట్ రీత్యా అక్టోబర్ 11 జూనియర్ కు ఏమాత్రం కలిసిరాలేదు కాబట్టి ఆరిలీజ్ డేట్ ‘అరవింద సమేత’ కు ఏమాత్రం కలిసిరాదని జూనియర్ అభిమానుల వితండ వాదన. ఇది ఇలా ఉండగా నిన్నసాయంత్రం విడుదలైన ‘అరవింద సమేత’ మూవీలోని ‘అనగనగా’ అంటూ సాగే మొదటి పాట ఇన్‌స్టంట్‌ గా అభిమానులకు కనెక్ట్ అయింది. తమన్ శ్రావ్యమైన సంగీతం అర్మాన్ మాలిక్ చక్కటి గానం సిరివెన్నెల సీతారామశాస్త్రి మార్కు సాహిత్యం అన్నీ చక్కగా కుదిరినా ఈపాటలోని పూజా హెగ్డే లుక్ చూసి జూనియర్ అభిమానులు అడిరిపోతున్నారు.

ఈపాటలో ఎన్టీఆర్ చాలా అందంగా ఉన్నాడు కానీ పూజా లుక్ తేడాగా ఉందని ఆమె ముఖంలో కళ లేదు మేకప్ కూడా బాగా లేదు అంటూ అప్పుడే కామెంట్స్ మొదలైపోయాయి. ‘దువ్వాడ జగన్నాథం’ లో చాలా అందంగా కనిపించిన పూజా ఇటీవల ‘సాక్ష్యం’ లో అంత బాగా కనిపించలేదు. దీనిపై ఆమె లుక్ విషయంలో విమర్శలు విపరీతంగా వచ్చాయి. దీనితో ‘అరవింద సమేత’ లాంటి పెద్ద ప్రాజెక్టులో పూజా హెగ్డే మళ్ళీ తేడాగా కనిపిస్తూ ఉండటంతో ఈమూవీ పై రిలీజ్ డేట్ నెగిటివ్ సెంటిమెంట్  అప్పుడే ప్రారంభం అయిపోయిందని అందువల్ల తప్పనిసరిగా ‘అరవింద సమేత’ రిలీజ్ డేట్ మార్చమని జూనియర్ అభిమానులు త్రివిక్రమ్ పై ఒత్తిడి చేస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: