బిగ్ బాస్ లో కొట్టుకున్న కౌశల్, తనీశ్.. బలాబలాలు చూపించాల్సిన టైం వచ్చింది..!

frame బిగ్ బాస్ లో కొట్టుకున్న కౌశల్, తనీశ్.. బలాబలాలు చూపించాల్సిన టైం వచ్చింది..!

shami
బిగ్ బాస్ ఫైనల్స్ కు దగ్గర పడుతున్న ఈ చివరి వారాల్లో హౌజ్ లో కంటెస్టంట్స్ మధ్య గొడవలు మరింత ముదురుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇంట్లో ఉన్న సభ్యులందరికి కౌశల్ పూర్తిగా ఎగైనెస్ట్ గా మారాడు. తను చేసే కామెంట్ల మీద తానే నిలబడడు అంటూ సోమవారం ఎపిసోడ్ లో కౌశల్ ను ఇంట్లో ఉన్న మిగతా ఇంటి సభ్యులంతా కార్నర్ చేశారు.


తనీష్ అయితే అసలు కౌశల్ ను గెలవనివ్వడం లేదు. గీతా మాధురి ఎటాకింగ్ గా మాట్లాడింది. సామ్రాట్, దీప్తి, రోల్ రైడా అడపాదడపా మాట్లాడారు. ఇదిలాఉంటే అసలు సిసలు బలాబలాలు తేల్చుకునే ఆట ఈరోజు ఉందని తెలుస్తుంది. ఈరోజు ఎపిసోడ్ గా వచ్చిన ప్రోమోలో బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు.


అందులో బలాబలాలు చూపించాల్సి వచ్చింది. ఈ క్రమంలో తనీష్, కౌశల్ పొట్లాడుకోవడం జరిగింది. వాట్.. వాట్.. ఏంటి.. ఏంటి అంటూ ఒకరినొకరు పట్టుకున్నారు. దాదాపు ఈ గొడవని చూస్తుంటే ఇద్దరు కొట్టుకున్నట్టే అనిపిస్తుంది. కొన్నాళ్లుగా కౌశల్ హౌజ్ లో చేసే పనుల వల్ల తనీష్.. తనీష్ చేస్తున్న కామెంట్స్ వల్ల కౌశల్ ఇద్దరు ఒకరి మీద ఒకరు కోపంగా ఉన్నారు.


ఫైనల్స్ దగ్గర పడుతున్న ఈ తరుణంలో అది మరింత ముదిరింది. టాస్క్ లో భాగంగా ఫైట్ చేస్తున్నా పర్సనల్ గా ఈ ఇద్దరు ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఇంట్లో వారందరికి ఎగైనెస్ట్ అయినా సరే బిగ్ బాస్ లో ఉన్న కౌశల్ కు బయట కౌశల్ ఆర్మీ మాత్రం సపోర్ట్ గా నిలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: