లవర్ బాయ్ లుక్ తో..మిస్టర్ మజ్నూ టీజర్!

frame లవర్ బాయ్ లుక్ తో..మిస్టర్ మజ్నూ టీజర్!

siri Madhukar

టాలీవుడ్ మన్మధుడు, కింగ్ అక్కినేని నాగార్జున తనయులు అక్కినేని నాగ చైతన్య, అఖిల్ లు హీరోలుగా రాణిస్తున్నారు.  నాగచైతన్య మొదటి సినిమా జోష్ తో ఎంట్రీ ఇచ్చాడు..కానీ ఆ సినిమా  పెద్దగా సక్సెస్ సాధించలేదు..ఆ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏం మాయ చేసావే’ సినిమాలో రొమాంటిక్ లవర్ బాయ్ గా కనిపించాడు. ఈ సినిమాతోనే సమంత హీరోయిన్ గా పరిచయం అయ్యింది.  ఇక వివివినాయక్ దర్శకత్వంలో అఖిల్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు అక్కినేని అఖిల్.  అయితే ఈ సినిమా కమర్శియల్ హిట్ కాలేదు..కానీ అఖిల్ కి డ్యాన్స్, ఫైట్స్ కి మంచి ఆదరణ లభించింది. 


ఆ తర్వాత వచ్చిన ‘హలో’ సినిమా కూడా పెద్దగా పేరు తీసుకు రాలేక పోయింది.  దాంతో ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీకి అచ్చొచ్చిన ప్రేమ కథా పైనా ఫోకస్ చేస్తున్నాడు అక్కినేని అబ్బాయి. ప్రస్తుతం   వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ 'మిస్టర్ మజ్ను' చిత్రం రూపొందుతోంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా నిర్మితమవుతోంది. కొంతసేపటి క్రితమే ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను .. 49 సెకన్ల వీడియో క్లిప్ ను రిలీజ్ చేశారు.ఒక సాంగ్ బిట్ .. ఒక డైలాగ్ పై ఈ వీడియో ను కట్ చేశారు. 


ఈ టీజర్ చూస్తుంటే.. రొమాంటిక్ లవర్ బాయ్ గా కనిపిస్తున్నాడు అఖిల్.  ‘ఎక్స్‌క్యూజ్ మీ మిస్..ఏమిటో ఈ ఇంగ్లిష్ భాష. దేన్నైతే మిస్ చేయకూడదో, దాన్నే మిస్ అన్నారు..’ అనే డైలాగ్‌ కుర్రాళ్లకు ఉత్సాహాన్ని ఇస్తోంది.  ‘దేవదాసు మనవడు .. మన్మథుడికి వారసుడు .. కావ్యములో కాముడు .. అంతకన్నా రసికుడు .. ’అంటూ ఈ సాంగ్ సాగుతోంది.  కొత్త లుక్ తో కనిపిస్తూ అఖిల్ ఆకట్టుకుంటున్నాడు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను జనవరి 26వ తేదీన విడుదల చేసే అవకాశం వున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: