అరవింద సమేత.. కొత్త ట్రెండ్ సృష్టిస్తుంది..!

frame అరవింద సమేత.. కొత్త ట్రెండ్ సృష్టిస్తుంది..!

shami
ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ అరవింద సమేత. దసరా బరిలో దిగేందుకు వస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రాబోతుంది.


సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా ఈరోజు సినిమా ఆడియో రిలీజ్ జరుగనుంది. ఫ్యాన్స్ సమక్షంలో కాకుండా చిన్న ప్రెస్ మీట్ లానే పెట్టి అరవింద సమేత ఆడియో రిలీజ్ చేస్తారట. బాలకృష్ణ ఈ ఆడియోకి వస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాడు ఎన్.టి.ఆర్.


అదేంటి అంటే ఇదవరకు సినిమా సాంగ్స్ రిలీజ్ అంటే కేవలం సాంగ్స్ మాత్రమే రిలీజ్ చేసేవారు. అయితే అరవింద సమేత సినిమా మాత్రం కొత్తగా ఆ సాంగ్ కు ముందు లీడ్ సీన్ చూపిస్తున్నారు. అంటే ఆ పాట సందర్భాన్ని చెప్పే సీన్ అన్నమాట. కచ్చితంగా ఇది త్రివిక్రం ప్లాన్ అన్నట్టు తెలుస్తున్నా అరవింద సమేతతో ఎన్.టి.ఆర్ ఈ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాడని అనిపిస్తుంది.


ఇక నుండి అన్ని సినిమాలు ఇలాంటి ట్రెడ్న్ కొనసాగించే అవకాశం ఉందని చెప్పొచ్చు. కేవలం టీజర్, ట్రైలర్ మాత్రమే కాకుండా సాంగ్స్ లీడ్ చూపించడం ప్రత్యేకమైన విషయమని చెప్పొచ్చు. మరి అరవింద సమేత మొదలుపెట్టిన ఈ కొత్త ట్రెండ్ ఎలా కొనసాగుతుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: