షాకింగ్ సద్గురు జగ్గీ వాసుదేవ్ ను ప్రశ్నించిన విజయ్ దేవరకొండ!

Seetha Sailaja
టాలీవుడ్ సంచలనంగా మారిపోయిన విజయ్ దేవరకొండ ప్రవర్తన చాల విభిన్నంగా ఉంటుంది. తన అభిమానులను ‘రౌడీస్’ అని పిలుస్తూ తాను చేసే ప్రతి పనిలోనూ తనదైన ముద్రను చూపించుకునే ఈ సంచలన హీరోకు ఆధ్యాత్మిక లక్షణాలు ఉన్నాయి అంటే ఎవరూ నమ్మలేని విషయం అయితే ఇది నిజం. 

విజయ్ ఈమధ్య ఈశా ఫౌండేషన్ స్థాపకుడు 'సద్గురు' జగ్గీ వాసుదేవ్ ను ఇంటర్వ్యూ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తి వేసాడు. ఇప్పుడు ఆ  ఇంటర్వ్యూ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది. ఆ ఇంటర్వ్యూలో విజయ్ అడిగిన ప్రశ్నలను పరిశీలిస్తే ఈ సంచలన నటుడు తనలోని అంతర్ముఖాన్ని తెలుసుకోవడానికి చాల ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. 

ఇదే సందర్భంలో విజయ్ సద్గురు జగ్గీ వాసుదేవ్ స్వామీజీని ప్రశ్నిస్తూ తన జీవితంలో జరిగిన సంఘటనలు తనను ఈవిధంగా మార్చాయి అనీ అలాంటి పరిస్థుతులలో గురువుగా మారడానికి మీజీవితంలో ఏం జరిగింది అంటూ ప్రశ్నించాడు. దానికి సద్గురు సమాధానం ఇస్తూ ‘నీ దగ్గర ఒకే ప్రశ్న ఉంది కాబట్టి సమాధానం దొరికింది. నాకు లక్షలకొద్దీ ఇంకా ప్రశ్న ఉన్నాయి ఆసమాధానాలు వెతికే ప్రయత్నంలో నా జీవితాన్ని అంకితం చేశాను’ అంటూ సమాధానం ఇచ్చారు. 

ఇది చాలదు అన్నట్లుగా విజయ్ ఏకంగా సద్గురుని ఇరికించాలని ప్రయత్నిస్తూ అందరూ ‘ప్రేమ' ఉంటే చాలంటారు.  డబ్బులేనప్పుడు ప్రేమ మనతో ఉంటుందా ? ప్రేమ - ధనం రెండిట్లో మనిషిక ఏది ముఖ్యం అంటూ ప్రశ్నించాడు. దానికి నవ్వుతూ సద్గురు సమాధానం ఇస్తూ ‘డబ్బు వల్ల బయట ఉండే సౌకర్యాలు వస్తాయి ప్రేమ అనేది అంతర్గతంగా శాంతినిస్తుంది.  బాత్ రూమ్ స్ప్రే ను గ్లోబల్ వార్మింగ్ కు సొల్యూషన్ గా నువ్వు వాడలేవు.  ప్రేమ అనేది  నీ లోపల జరిగేది. అది నీ హృదయంలోని తీయదనం ఉంటేనే అది అర్ధం అవుతుంది’ అంటూ విజయ్ కి జ్ఞానోదయం కలిగించడానికి తన వంతు ప్రయత్నం చేసారు  సద్గురు స్వామీజీ. ఏమైనా విజయ్ దేవరకొండలో బయటపడని వేదాంత ధోరణిని ఈప్రశ్నలు ప్రతిబింబిస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: