ప్రణయ్..హత్యపై ఘాటుగా స్పందించిన వర్మ!

frame ప్రణయ్..హత్యపై ఘాటుగా స్పందించిన వర్మ!

siri Madhukar
తెలుగు రాష్ట్రాలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య పలువురు సినీ, రాజకీయ నేతలు స్పందించారు.  కేవలం కులాంతర వివాహం చేసుకున్నందుకు ప్రేమికుల జీవితాలతో ఆడుకోవడం..హత్య చేయించడం సమంజసం కాదని..ఇంకా కులపిచ్చి ఉన్న మూర్ఖులు ఉన్నారా..అంటూ ప్రశ్నిస్తున్నారు.  సభ్య సమాజం సిగ్గు పడేలా తన కూతురు ఐదు నెలల గర్భిణి అని తెలిసి కూడా ఆమె భర్తను చంపించిన అమృత తండ్రి మారుతిరావుకి కఠినమైన శిక్ష విధించాలని కోరుతున్నారు.   

మిర్యాలగూడలో ఇటీవల జరిగిన పరువు హత్యపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఘాటుగా స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘అమృత తండ్రి మారుతీరావు ఒక పిరికి, క్రూరుడైన క్రిమినల్. ప్రణయ్‌ను హత్య చేయించడం వల్ల అతనికి ఒరిగిందేమీ లేదు. కొత్తగా పరువు వచ్చిందేం లేదు. ఒకవేళ అతడు పరువు కోసమే ఈ హత్య చేయించినట్టైతే.. అతడు చావడానికి సిద్ధంగా ఉండాలి.

పరువు కోసం ఎవరినైతే చంపిస్తారో వారిని చంపినప్పుడే అది నిజమైన పరువు హత్య’ అంటూ తనదైన శైలిలో స్పందించారు.  ఇక వర్మ స్పందనపై ఇప్పుడు నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు.   ‘ఇంకా రాలేదు ఏమిటి అనుకుంటున్నా.. వచ్చేశావా? వర్మా.. నెక్స్ట్ సినిమా పేరు మిర్యాలగూడలో మర్డర్ ఆ???’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వర్మ ప్రణయ్ హత్యోదంతంపై సినిమా తీయాలంటూ వర్మను కోరుతున్నారు ఆయన అభిమానులు. 





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: