జూనియర్ అభిమానుల కామెంట్స్ కు ఖంగారు నిర్ణయాలలో త్రివిక్రమ్ !

Seetha Sailaja
‘అరవింద సమేత’ మూవీకి సంబంధించిన అన్ని పాటలు విడుదలై ఆమూవీ రిలీజ్ డేట్ తరుముకు వస్తున్న నేపధ్యంలో త్రివిక్రమ్ తీసుకున్న ఒక నిర్ణయం జూనియర్ కు కూడ ఆశ్చర్యం కలిగించినట్లు టాక్. వాస్తవానికి ఈసినిమాకు సంబంధించి 5 పాటలను రికార్డు చేయడం జరిగినా హరికృష్ణ మరణంతో ఏర్పడ్డ అనుకోని బ్రేక్ వల్ల ఈమూవీకి సంబంధించిన 5 పాట షూటింగ్ పక్కకు పెట్టి 4 పాటలుతోనే సినిమాను రిలీజ్ చేయాలని భావించారు. 

అయితే ఈ మూవీకి సంబంధించిన ఆడియో విడుదలైన తరువాత కొందరు ముఖ్యంగా జూనియర్ అభిమానులలోని కొన్ని వర్గాలు కేవలం నాలుగు పాటలతో టాప్ హీరో సినిమాను విడుదల చేస్తే జూనియర్ అభిమానులైన మాస్ ప్రేక్షకులు కనెక్ట్ అవ్వరు అంటూ కామెంట్స్ వచ్చాయి. మొదట్లో ఈ కామెంట్స్ ను పట్టించుకోని త్రివిక్రమ్ చివరి నిముషంలో ఈ కామెంట్స్ ను సీరియస్ గా తీసుకుని ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఒకవైపు ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పెండింగ్ లో ఉంది. ఇంకా చిన్నచిన్న సీన్స్ కు సంబంధించిన షూటింగ్ ప్యాచ్ వర్క్ మిగిలి ఉన్నా అవేమీ పట్టించుకోకుండా త్రివిక్రమ్ ఒక్కపాట కోసం తన యూనిట్ ను ఇటలీ తీసుకువెళ్ళుతున్నాడు. రేపోమాపో వీరంతా యూరోప్ కు బయల్దేరుతున్నారని టాక్. 

అక్కడ తారక్ పూజాహెగ్డే మధ్య సాంగ్ తీస్తారట. ఈమూవీని నిర్మిస్తున్న హారిక హాసిని సంస్థలో  త్రివిక్రమ్ ఎంత చెబితే అంత. ఈపాట విషయంలో కూడ జూనియర్ వద్దు అని చెపుతున్నా చివరకు త్రివిక్రమ్ మొండి పట్టుదల నెగ్గింది అన్న వార్తలు వస్తున్నాయి. ఆఖరి నిముషం ప్రయోగాలు వల్ల ‘అరవింద సమేత’ ఎడిటింగ్ విషయంలో త్రివిక్రమ్ ఏకాగ్రత తప్పుతాడేమో అన్న భయం జూనియర్ తో పాటు ఈమూవీ యూనిట్ అందరికీ ఉన్నా ప్రస్తుత పరిస్థుతులలో త్రివిక్రమ్ ను ఆపలేని స్థితి అని అంటున్నారు..    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: