జూనియర్ కు సహాయపడుతున్న పవన్ పై రిసెర్చ్ !

Seetha Sailaja
రాయలసీమ ఫ్యాక్షన్ నేపధ్యంలో గతంలో టాప్ హీరోలతో చాలసినిమాలు వచ్చాయి. కొన్నిసినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొడితే మరికొన్ని ఫ్లాప్ అయిన సందర్భాలు కూడ ఉన్నాయి.  అయితే గతంలో వచ్చిన ఆసినిమాలలో రాయలసీమ మాండలికాన్ని డైలాగుల రూపంలో కేవలం పదిశాతం మాత్రమే వాడారు. అయితే రాయలసీమ మాండలీకాన్ని ఉన్నది ఉన్నట్లుగా డైలాగుల రూపంలో ‘అరవింద సమేత’ లో వాడుతున్నారు.  తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ సగభాగం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లోనే జరుగుతుంది. 

ఈమూవీలోని ప్రతిపాత్ర అచ్చమైన రాయలసీమ మాండలీకంతో కూడిన డైలాగులు వాడేలా త్రివిక్రమ్ డైలాగులు వ్రాయడానికి పవన్ కళ్యాణ్ కారకుడు అంటూ వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ పవన్ తో ‘కోబలి’ సినిమా తీయాలి అన్న ఉద్దేశ్యంతో రాయలసీమ మాండలీకం పై చాల కసరత్తు చేసాడు. అయితే ఆమూవీ త్రివిక్రమ్ పవన్ తో తీయలేకపోయినా ‘కోబలి’ కోసం త్రివిక్రమ్ చేసిన రిసర్చ్ ఇప్పుడు ‘అరవింద సమేత’ కు ఉపయోగ పడింది అని వార్తలు వస్తున్నాయి. 

సీమలో ఫ్యాక్షనిజం ఎలా పుట్టింది గతంలో ప్రత్యర్ధులు ఒకరిపై ఒకరు దాడులు ఎలా చేసుకునేవారు దేశంలో రాయలసీమ ఫ్యాక్షనిజంకు ఉన్నగుర్తింపు లాంటి అనేక విషయాలకు సంబంధించి త్రివిక్రమ్ చాల లోతుగా పవన్ ‘కోబలి’ కోసం చేసిన రిసర్చ్ వృథా కాకుండా దానిని జూనియర్ ఇమేజ్ కు తగ్గట్టుగా ‘అరవింద సమేత’ కథగా మార్చాడు అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఈమూవీని చూసే ప్రేక్షకులకు సినిమా మొదటి నుండి హైక్ తీసుకు రావడానికి ఈమూవీ ప్రారంభం అయిన కొద్ది సేపటికే ఇంటర్వెల్ బ్లాక్  లో రావాల్సిన కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ లో ఒకదాన్ని ఇలా సినిమా మొదలైన కొద్ది సేపటికే చూపెట్టబోతున్నారు అని తెలుస్తోంది. 

సాధారణంగా టాప్ హీరోల సినిమాలలో భారీ యాక్షన్ సీన్స్ ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ లో పెడతారు. అయితే దీనికి విరుద్ధంగా త్రివిక్రమ్ మరోకొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తూ ‘అరవింద సమేత’ లో సినిమా ముందులోనే భారీయాక్షన్ సీన్ చూపించడం మరొకప్రయోగం అనిఅంటున్నారు. ఇలాఎన్నో ప్రయోగాలు ఈమూవీలో కనిపిస్తున్న నేపధ్యంలో ఈప్రయోగాలకు మాస్ ప్రేక్షకులు ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు అన్న భయం బయ్యర్లలో రోజురోజుకు పెరిగిపోతున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: