ఆ ఎమ్మెల్యే ను మావోలు చంపింది పార్టీ మారినందుకేనా...!

Prathap Kaluva

కిడారి సర్వేశ్వరరావును మావోలు దారుణంగా హత మార్చారు దీనితో రాష్ట్రం ఒక్క సారిగా ఉలిక్కి పడింది. అయితే  ఫిరాయించిన వారిలో భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించాడు, ఇప్పుడు కిడారి సర్వేశ్వరరావును మావోలు హతమార్చారు. ఈ రెండు మరణాలకూ వీరి రాజకీయ గమనానికి సంబంధం ఉండటం గమనార్హం. ముందుగా భూమా నాగిరెడ్డి చంద్రబాబు పెట్టిన ఒత్తిడిని భరించలేకే మరణించాడు అనేది వాస్తవం.


వైసీపీలో ఉన్నప్పుడే భూమా నాగిరెడ్డిపై చంద్రబాబు మార్కు రాజకీయం సాగింది. ఆయనపై రకరకాల కేసులు పెట్టించారు. జైలుకు తరలించారు. నానా తిప్పలు పెట్టారు. ఇక ఆ ఒత్తిడిని తట్టుకోలేక.. కేసుల తలనొప్పిని తట్టుకోలేక భూమా తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయాడు. అలా చేరినా చంద్రబాబు నుంచి రకరకాల ఒత్తిళ్లు కొనసాగాయి. ఎమ్మెల్సీ ఎన్నికలో బలం లేకపోయినా పార్టీని గెలిపించే విషయమై చంద్రబాబు నాయుడు భూమాపై తీవ్రమైన ఒత్తిడిని పెట్టడం.


పార్టీ గెలుస్తుందో లేదో అనే ఒత్తిడి మధ్యన భూమా తీవ్రమైన గుండెపోటుకు గురి కావడం జరిగింది. గుండెపోటుతో భూమా చనిపోయాకా కూడా.. హెలికాఫ్టర్ అంబులెన్స్ అంటూ రాజకీయం చేసిన ఘనత చంద్రబాబు నాయుడిదే. ఇక భూమా కుటుంబంతో చంద్రబాబు రాజకీయం అలా సాగగా... ఇప్పుడు కిడారి సర్వేశ్వరరావు కూడా ఒకవేళ తెలుగుదేశం పార్టీలో చేరకుంటే ఇలా హత్యకు గురి అయ్యే వాడు కాదని స్పష్టం అవుతోంది. అధికార పార్టీలో చేరిపోయి... బాక్సైట్, ఇతర మైనింగ్ వ్యవహారాల్లో కిడారి పాత్ర పోషిస్తుండటంతోనే ఆయన మావోల టార్గెట్ అయ్యాడని విశ్లేషకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: