విజయవాడలో విజయ్ దేవరకొండ రచ్చ !

Seetha Sailaja
నిన్న సాయంత్రం విజయవాడలో ‘నోటా’ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ పై విజవాడ ప్రజలు కనపరిచిన అభిమానం పరిశీలించిన వారు విజయ్ రానున్న రోజులలో సూపర్ స్టార్ అయిపోయినా ఆశ్చర్యం లేదు అంటూ కామెంట్స్ చేసినట్లు టాక్. సాధారణంగా తెలంగాణా ప్రాంతానికి చెందిన యంగ్ హీరోలకు ఆంధ్రా ప్రాంతాలలో వీరాభిమానులు ఉండరు.

అయితే దీనికి భిన్నంగా నిన్న విజయవాడలో జరిగిన ‘నోటా’ ఫంక్షన్ లో విజయ్ కు లభించిన స్వాగతం చూస్తే గతంలో జూనియర్ ఎన్టీఆర్ మహేష్ లకు తమ సినిమాలకు సంబంధించి గతంలో విజయవాడలో జరిగిన ఫిలిం ఫంక్షన్స్ గుర్తుకు వస్తున్నాయి అంటూ చాలామంది కామెంట్స్ చేసుకున్నారు. తనకు లభించిన అపూర్వ ఆదరణకు పొంగిపోయిన విజయ్ మరింత రెచ్చిపోయి తనను చూడటానికి వచ్చిన తన అభిమానులతో తనదైన స్టైల్ లో మాట్లాడి ఆకార్యక్రమాన్ని మరింత రక్తి కట్టించాడు. 

గత వారం విడుదలైన ‘దేవదాస్’ కు డివైడ్ టాక్ రావడంతో ఈవారం విడుదల కాబోతున్న ‘నోటా’ కు ధియేటర్ల విషయంలో ఎటువంటి సమస్యలు ఎదురు కావడం లేదు. ఇప్పటికే ‘గీత గోవిందం’ మ్యానియాతో దూసుకుపోతున్న విజయ్ క్రేజ్ కు ‘నోటా’ కూడ సక్సస్ అయితే విజయ్ మ్యానియాకు ఇక ఆకాశమే హద్దు కాబోతోంది. 

‘నోటా’ ను తమిళంలో ప్రమోట్ చేస్తూ తమిళంలో మాట్లాడటమే కాకుండా తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి కవితలు చెపుతూ కోలీవుడ్ మీడియాను ఆకర్షిస్తున్న విజయ్ త్వరలో తాను తమిళంలో కవితలు రాస్తాను అంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఆంధ్రా ప్రాంతంలో కూడ కనపడుతున్న విజయ్ మ్యానియాను చూస్తుంటే అదృష్టం కలిసి వచ్చి ‘నోటా’ కూడ సక్సస్ అయితే మన టాప్ యంగ్ హీరోల పరిస్థితి ఏమిటి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: