బాలీవుడ్ లో గత కొన్ని రోజుల నుంచి కాస్టింగ్ కౌచ్ పై సంచలన ఆరోపణలు చేస్తుంది నటి తనుశ్రీ దత్తా. అయితే అన్ని ఇండస్ట్రీలో కొంత మందికి లైంగిక వేధింపులు తప్పడం లేదని..ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు నటీమణులు. తాజాగా తనూశ్రీ దత్తా బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని వెల్లడించి షాక్ ఇచ్చిన తను శ్రీ దత్తా తాజాగా ఓ ప్రముఖ డైరెక్టర్‌పై కూడా సంచలన ఆరోపణలు చేసింది. అంతే కాదు ప్రముఖ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కూడా తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ వెల్లడించింది. అయితే ఆ సమయంలో బాలీవుడ్ నటులు ఇర్ఫాన్ ఖాన్, సునీల్ శెట్టి తనను రక్షించారని చెప్పింది.
ఇక కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై కూడా సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఈ వివాదం రోజు రోజుకి ముదురుతూ వెళుతుంది. సోనం కపూర్, ట్వింకిల్ ఖన్నా, ప్రియాంక చోప్రా, ఫర్హాన్ అక్తర్, సిమీ గరేవాల్, అనురాగ్ కశ్యప్, పూజా భట్, రవీనా టాండన్, కొయినా మిత్రా తదితర నటులు తను శ్రీకి మద్దతుగా నిలవగా మరి కొందరు ఈ వివాదంపై సరిగ్గా స్పందించడం లేదు.
తాజాగా తను శ్రీ వివాదంపై బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ ఇచ్చిన సమాధానం అందరికి నవ్వుపుట్టించే విధంగా ఉంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న శక్తి కపూర్ ఒకప్పుడు విలన్ , కమెడియన్ గా నటించారు. ఆయన కూతురు శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే తనూ శ్రీ దత్తా వివాదంపై విలేకరి అడిగిన ప్రశ్నకు.. ఇది పదేళ్ళ కిందట జరిగిన సంఘటన. అప్పుడు నేను చిన్న పిల్లవాడిని. ఈ వివాదం గురించి తనకేమి తెలియదు అంటూ నవ్వుకుంటూ బదులిచ్చాడు. శక్తి కపూర్ స్పందించిన తీరు మహిళలని కించపరిచేలా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
#WATCH:I don't know anything about this case. This was ten years back, I was a kid back then: Shakti Kapoor on #TanushreeDutta's harassment allegations against Nana Patekar. (2/10/2018) pic.twitter.com/FxD7LHL6MM— ANI (@ANI) October 3, 2018